అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) 58వ జయంతి నేడు.. ఆమె జీవిత విశేషాలు ప్రత్యేకంగా మీకోసం

Updated on Aug 14, 2022 01:01 AM IST
బాలనటిగా కెరీర్ ప్రారంభించి అతిలోక సుందరిగా అభిమానుల గుండెల్లో సుస్ధిర స్ధానాన్నిదక్కించుకున్న శ్రీదేవి (Sridevi) జయంతి నేడు
బాలనటిగా కెరీర్ ప్రారంభించి అతిలోక సుందరిగా అభిమానుల గుండెల్లో సుస్ధిర స్ధానాన్నిదక్కించుకున్న శ్రీదేవి (Sridevi) జయంతి నేడు

బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. దాదాపుగా దశాబ్ద కాలంపాటు తెలుగుతో పాటు పలు భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఉన్నారు అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi). తన అందం, అభినయంతో సినీ ప్రేమికులతో పాటు, నటీనటులను కూడా తన అభిమానులుగా మలుచుకున్నారు శ్రీదేవి.

నేడు మన మధ్య లేకపోయినా, ఆమె నటించిన సినిమాల ద్వారా అభిమానుల గుండెల్లో శ్రీదేవి ఎప్పటికీ చిరస్మరణీయంగా బతికే ఉంటారు. నేడు శ్రీదేవి 58 వ జయంతి. ఈ సందర్భంగా ఆమె సినిమాలు, వ్యక్తిగత జీవితంపై ఒక చిన్న స్టోరీ.

బాలనటిగా కెరీర్ ప్రారంభించి అతిలోక సుందరిగా అభిమానుల గుండెల్లో సుస్ధిర స్ధానాన్నిదక్కించుకున్న శ్రీదేవి (Sridevi) జయంతి నేడు

1963, ఆగస్టు 13వ తేదీన తమిళనాడులో జన్మించారు శ్రీదేవి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీదేవి.. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యప్పన్ యంగర్.  జూలీ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు శ్రీదేవి. పదహారేళ్ల వయసు సినిమాతో హీరోయిన్‌గా మారారు.

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించారు శ్రీదేవి. రజినీకాంత్, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున,.. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్, అనిల్ కపూర్, జితేంద్ర, మిథున్ చక్రవర్తి, రిషికపూర్, ధర్మేంద్ర వంటి హీరోలతో పలు సూపర్‌‌హిట్ సినిమాల్లో నటించారు. 

బాలనటిగా కెరీర్ ప్రారంభించి అతిలోక సుందరిగా అభిమానుల గుండెల్లో సుస్ధిర స్ధానాన్నిదక్కించుకున్న శ్రీదేవి (Sridevi) జయంతి నేడు

200 కు పైగా సినిమాలు..

తన కెరీర్‌‌లో 200కు పైగా సినిమాల్లో నటించారు శ్రీదేవి (Sridevi). సీనియర్‌‌ ఎన్టీఆర్‌‌తో కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి వంటి సూపర్‌‌ డూపర్‌‌ హిట్‌ సినిమాల్లో, ఏఎన్నార్‌‌తో ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక మొదలైన క్లాసికల్ సినిమాల్లో నటించారు శ్రీదేవి.

ఇక, తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన కంచుకాగడా, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు వంటి హిట్ సినిమాలతోపాటు, కమల్ హాసన్‌ సరసన పలు సినిమాల్లో నటించారు శ్రీదేవి.

కమల్‌ హాసన్ తరువాత శ్రీదేవి కృష్ణతోనే ఎక్కువ సినిమాలు చేశారు. సద్మా, నగీనా, మిస్టర్ ఇండియా, చాందినీ, చాల్‌బాజ్, లమ్హే, జుదాయి, ఇంగ్లీష్ -వింగ్లీష్ వంటి పలు సూపర్ హిట్ హిందీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు శ్రీదేవి.

బాలనటిగా కెరీర్ ప్రారంభించి అతిలోక సుందరిగా అభిమానుల గుండెల్లో సుస్ధిర స్ధానాన్నిదక్కించుకున్న శ్రీదేవి (Sridevi) జయంతి నేడు

వ్యక్తిగత విషయాలు సీక్రెట్‌గానే..

 తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సీక్రెట్‌గా ఉంచడానికే ఇష్టపడేవారు శ్రీదేవి. డైరెక్టర్‌‌ బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్న శ్రీదేవి ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చారు. వారి పేర్లు జాన్వీ కపూర్,  ఖుషీ కపూర్. పెళ్లి తర్వాత చాలా కాలంపాటు సినిమాకు దూరమయ్యారు శ్రీదేవి.

దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్‌ వింగ్లీష్ అనే సినిమాతో మరోసారి సినిమాల్లోకి వచ్చారు శ్రీదేవి. అభిమానులను అలరిస్తున్న సమయంలోనే 2018, ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లోని ఒక హోటల్‌లో శ్రీదేవి (Sridevi) తుదిశ్వాస విడిచారు.

Read More : ఎన్టీఆర్, కొరటాల సినిమాలో.. శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ (Jhanvi Kapoor)

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!