బోయపాటి శ్రీను (Boyapati Srinu) : అఖండ 2 కోసం.. ఈయన మిగతా సిన్మాలు పక్కన పెట్టారా?

Updated on May 22, 2022 06:37 PM IST
Akhanda: బాల‌కృష్ణ అఖండ‌ 2 మూవీ పాన్ ఇండియా సినిమాగా వ‌స్తుందా!
Akhanda: బాల‌కృష్ణ అఖండ‌ 2 మూవీ పాన్ ఇండియా సినిమాగా వ‌స్తుందా!

బాల‌కృష్ణ న‌టించిన అఖండ (Akhanda) బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ క్రమంలో అఖండ సినిమాకు సీక్వెల్ కూడా తీయాల‌ని బోయ‌పాటి ప్లాన్ చేస్తున్నార‌ట‌. అందుకే ఈ స్టార్ డైరెక్టర్ 'అఖండ 2' కోసం వేరే సినిమాలు  కూడా ప‌క్క‌న పెట్టేశాడ‌ట‌. బోయ‌పాటి శ్రీను, బాల‌కృష్ణ కాంబినేషనులో వ‌చ్చే సినిమాల‌పై ప్రేక్ష‌కుల్లో ఎప్పుడూ భారీ అంచ‌నాలు ఉంటాయి. 

టాలీవుడ్‌లో బాల‌కృష్ణ‌  (Bala Krishna),  బోయ‌పాటి శ్రీనుల‌ది సూపర్ హిట్ కాంబినేష‌న్. థియేట‌ర్ల‌ను మోత మోగించే సినిమాలు అన్నీ కూడా వీరి కాంబోలోనే వ‌స్తుంటాయి. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పటికి, బాల‌కృష్ణ హీరోగా మూడు సినిమాలు చేశారు. అందులో ఒక‌టి అఖండ‌. క‌రోనా వేవ్‌లోనూ అఖండ భారీ విజ‌యాన్ని సాధించింది.  కాసుల వ‌ర్షం కురిపించింది. బాలయ్య డ‌బుల్ యాక్ష‌న్‌లో, ఈ సినిమా డ‌బుల్ లాభాలు తెచ్చిపెట్టింది. అంతే కాకుండా, రూ.125 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

ప్రస్తుతం బోయపాటి 'అఖండ 2' కోసం క‌థ‌లో భారీ మార్పులు చేయాల‌ని అనుకుంటున్నారు.  అందుకోసం భారీ యాక్ష‌న్ సీన్స్ సైతం ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్‌లో రాజకీయ కోణాన్ని కూడా జత చేయాలని, బోయ‌పాటికి పలువురు స‌ల‌హా ఇచ్చార‌ట‌.

ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను, రామ్ పోతినేనితో ఓ సినిమా చేయ‌నున్నారు. రామ్‌తో సినిమా అయిపోగానే. బాల‌య్య‌తో  'అఖండ 2' సినిమా తీస్తార‌ని టాక్. 

'అఖండ 2'  తీయడం కోసం, ఇప్ప‌టికే చాలామంది సినీ ర‌చ‌యిత‌ల‌తోనూ బోయ‌పాటి శ్రీను మాట్లాడార‌ట‌. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే, బోయపాటి దర్శకత్వంలో బాలయ్య, రాబోయే ఎన్నికల నాటికి ఓ భారీ పొలిటికల్ థ్రిల్లర్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారని వినికిడి.  అయితే కొన్ని కారణాల వల్ల, ఆ సినిమాను పక్కన పెట్టి.. అఖండ‌ 2 సినిమాపై దృష్టి మరల్చారు. కానీ ఏపీ ఎల‌క్ష‌న్ టైం నాటికి బాల‌య్య హీరోగా, కచ్చితంగా ఏదో ఒక పొలిటికల్ థ్రిల్లర్ విడుదల అవుతుందని టాక్.

ఇక అఖండ సీక్వెల్ విషయానికి వస్తే, ఇందులో మామూలు ట్విస్ట్‌లు ఉండవట. అన్నింటినీ త్యజించి వెళ్లిపోయిన "అఖండ రుద్ర సికిందర్ అఘోర" అనే  సిద్ధ పురుషుడు, ఓ పాప‌కు ఇచ్చిన మాట కోసం మ‌ళ్లీ తిరిగి వ‌స్తాడ‌నే క‌థ‌తో  'అఖండ 2'  తెరకెక్కనుందని సమాచారం. మిర్యాల రవీందర్ రెడ్డి  'అఖండ 2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని, పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దాలని కూడా బోయ‌పాటి ఆలోచిస్తున్నార‌ట‌. 

Advertisement
Credits: Boyapati Srinu (Facebook)

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!