Balakrishna : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్‌పై ఉత్కంఠ.. రేపు ప్రకటించే చాన్స్ !

Updated on Jun 09, 2022 06:25 PM IST
బాలకృష్ణ (BalaKrishna) , అనిల్‌ రావిపూడి
బాలకృష్ణ (BalaKrishna) , అనిల్‌ రావిపూడి

అఖండ సినిమాతో సూపర్‌‌ హిట్‌ అందుకున్నాడు బాలకృష్ణ (BalaKrishna). ఆ సినిమా తర్వాత ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య.

 ఆ సినిమా ప్రస్తుతం #NBK107 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఆ సినిమా తర్వాత హిట్‌ సినిమాల దర్శకుడు అనిల్‌ రావిపూడితో సినిమా చేస్తున్నాడు బాలయ్య. వీరిద్దరి కాంబోలో తెరకెక్కే సినిమా షూటింగ్‌ త్వరలోనే పట్టాలెక్కబోతోంది.

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నతాజా సినిమాపై అప్‌డేట్స్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. బాలకృష్ణ 108వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

పవర్‌‌ఫుల్‌ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్‌పై రకరకాల ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. పలు ఆసక్తికరమైన టైటిల్స్‌ కూడా ప్రచారంలోకి వచ్చాయి. బాలకృష్ణలో ఇప్పటి వరకు చూడని యాంగిల్‌ను తన సినిమాలో చూపిస్తానని అనిల్‌ రావిపూడి చెప్పడంతో బాలయ్య ఫ్యాన్స్‌కు ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

బాలకృష్ణ (BalaKrishna) , శ్రీలీల, ప్రియమణి, అంజలి

అక్టోబర్‌‌ నుంచి రెగ్యులర్ షూట్

అనిల్‌, బాలయ్య కాంబోలో రాబోయే సినిమాకు ‘జై బాలయ్య’ అని టైటిల్‌ పెట్టే చాన్స్‌ ఉందని కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. దీనినే చాలా మంది ఓకే చేస్తారని కూడా అనుకున్నారు. అయితే ఈ సినిమాకు వేరే టైటిల్‌ పెట్టనున్నారని టాక్. బాలయ్య వ్యక్తిత్వానికి తగినట్టుగా ‘బ్రో.. ఐ డోంట్‌ కేర్’ అనే టైటిల్‌ పెడితే బాగుంటుందని కూడా చిత్ర యూనిట్ ఆలోచిస్తోందట.

శుక్రవారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 108వ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నారని టాక్. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా "పెళ్లిసందడి" హీరోయిన్‌ శ్రీలీల కూతురిగా నటించనుందని సమాచారం. అలాగే ప్రియమణి, అంజలి కీలకపాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ అక్టోబర్‌‌ నుంచి ప్రారంభం కానుంది.

కాగా, 'పటాస్' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనిల్ రావిపూడి తీసిన అన్ని సినిమాలు హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. మహేష్‌బాబుతో తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’, ఎఫ్‌ 2 కి సీక్వెల్‌గా తీసిన ఎఫ్‌3 ..ఇటీవలే రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది.

ఇక, అఖండ సినిమాతో బాలకృష్ణ (BalaKrishna) కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఊపుమీదున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాపై బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

Read More: సినిమాలో క‌మెడియ‌న్స్ లేకున్నా ప‌ర్వాలేదు.. కానీ కామెడీ ఉండాలి : బ్ర‌హ్మానందం 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!