కామెడీ సినిమాతో సందడి చేయనున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. త్రివిక్రమ్‌తో సినిమాకు ఓకే చెప్పాడా?

Updated on Jun 05, 2022 10:54 PM IST
త్రివిక్రమ్ శ్రీనివాస్, చిరంజీవి (Chiranjeevi)
త్రివిక్రమ్ శ్రీనివాస్, చిరంజీవి (Chiranjeevi)

‘ఆచార్య’సినిమా పరాజయంతో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. భవిష్యత్తులో తాను చేయబోయే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని సమాచారం. ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే స్పీడ్ పెంచిన చిరు.. రెండు మూడు సినిమాలను ఓకే చేసి వాటిని పట్టాలెక్కించేశాడు కూడా. కొడుకు రాంచరణ్‌తో కలిసి తను చేసిన ఆచార్య సినిమా ఫలితం నిరాశపరచడంతో తన తరువాతి ప్రాజెక్టులపై స్పెషల్ కేర్ తీసుకుంటూ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడట మెగాస్టార్. ఒక యంగ్ డైరెక్టర్‌తో కమిట్ అయిన సినిమాని కూడా చిరు ప్రస్తుతం నిలిపి వేశారని ఇండస్ట్రీ టాక్.

ఇక, ఆ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేసి రీప్లేస్ చేయాలని అనుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా సీరియస్ రోల్స్‌లో కనిపిస్తున్న చిరంజీవి ఆ సినిమా తర్వాత ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నాడట. అసలే ఆచార్య సినిమా ఫలితంతో నిరాశచెందిన చిరంజీవికి అర్జెంటుగా హిట్‌ కావాలి. ఇటువంటి సమయంలో త్రివిక్రమ్‌తో సినిమా చేస్తే చిరు అభిమానులు కూడా కొత్త ఉత్సాహాన్ని పొందుతారని అనుకుంటున్నాడట చిరంజీవి.

చిరంజీవి (Chiranjeevi) జైచిరంజీవ సినిమా పోస్టర్

ఈ ఆలోచనతోనే త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి మెగాస్టార్ రెడీ అయ్యాడట. చిరులోని కామెడీ యాంగిల్‌ని ఫుల్ లెంగ్త్‌లో చూపిస్తూ, అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాను త్రివిక్రమ్ చేయనున్నాడని టాక్. నిజానికి చిరంజీవి – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటికే జై చిరంజీవ సినిమా వచ్చింది. అయితే ఆ సినిమాకి త్రివిక్రమ్ కేవలం డైలాగ్ రైటర్ మాత్రమే. ఈ సినిమాలో చిరు డైలాగ్స్, పంచ్‌ టైమింగ్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చిరంజీవి సినిమా చేయడం అది కూడా ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌‌టైనింగ్ సినిమా అంటే ప్రేక్షకులకు ఎంత ఎంటర్‌‌టైన్‌మెంట్‌ అందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

Read More: మెగాస్టార్ చిరంజీవితో భీష్మ డైరెక్టర్ సినిమా.. రూమర్స్ పై క్లారిటీ ఇదే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!