టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురు రిసెప్షన్ లో సందడి చేసిన మహేష్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun)!

Published on Dec 13, 2022 07:37 PM IST

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గుణశేఖర్ (Director Gunashekar) కుమార్తె నీలిమా వివాహం ఇటీవల వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో జరిగింది. కాగా, ఆదివారం రోజున ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. అయితే, ఈ వేడుకకు సీని రాజకీయ ప్రముఖులు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు టాలీవుడ్ అగ్ర తారలు తరలిరావడంతో భారీ సందడి నెలకొంది.

ఈ నేపథ్యంలో ఈ వేడుకకు మహేష్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun) కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఒకే వేదికపై ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తూ ఫోటో దిగారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. 

ఈ ఫొటోలో ఓవైపు బన్నీ.. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ఉండడం చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరి ఫోటోను చూసిన నెటిజన్లు.. ‘వాటే కాంబినేషన్‌’.. ’ఫోటో ఆఫ్‌ ది ఇయర్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

నీలిమా వివాహ రిసెప్షన్ కు హాజరైన వారిలో రాజమౌళి-రమ, కె.రాఘవేంద్రరావు, రాజశేఖర్-జీవిత దంపతులు, సంగీత దర్శకుడు మణిశర్మ, సీనియర్ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీరందరూ రిసెప్షన్ కు విచ్చేసి నూతన వధూవరులు నీలిమ (Guna Neelima), రవిలను ఆశీర్వదించారు.

Read More: ‘అవతార్ 2’ (Avatar 2) సినిమా కోసం డైలాగ్ రైటర్ గా టాలీవుడ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas)..!