Mass Maharaj Raviteja: మరోసారి వాయిదాపడ్డ ‘రామారావు ఆన్ డ్యూటీ’.. ఆ గొడవలే కారణమా?
Mass Maharaj Raviteja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజి బిజీగా ఉన్నారు. ఆయన లిస్టులో ఉన్న సినిమాల్లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది ఈ చిత్రం. ఎప్పటి నుంచో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. కానీ.. సరైన రిలీజ్ డేట్ కుదరకపోవటంతో ఎప్పుడో జనవరిలో రిలీజ్ అనుకున్న సినిమాను కాస్త తర్వాత ఏప్రిల్‌లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా తర్వాత వరుస సినిమాలు ఫిక్స్ కావటంతో ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను జూన్ 17న విడుదల చేయాలని భావించారు. అందుకు తగినట్లు ఇటీవల ప్రకటన కూడా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఈ మూవీ మరోసారి వాయిదా పడింది. మరో మూడు నాలుగు వారాల్లో 'రామారావు ఆన్ డ్యూటీ' (Ramarao on Duty) సినిమా విడుదల అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఫ్యాన్స్ సహా అందరికీ మేకర్స్ షాకిచ్చారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న రామారావు ఆన్‌డ్యూటీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలి ఉన్నాయని, వాటి జాప్యం కారణంగా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం చెప్పింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని చెప్పారు. దీనికోసం మరికొన్ని రోజులు ఆగక తప్పదు. అయితే, అసలు ఎందుకు సినిమాను వాయిదా వేశామనే విషయంపై చిత్ర యూనిట్ వివరణ ఇవ్వలేదు. దీంతో రవితేజ ఫ్యాన్స్ చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
కాగా, శరత్ మండవ (Sharat Mandava) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రవితేజ ఎంఆర్‌ఓ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఓ సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ అవినీతి రాజకీయ నాయకుల భరతం ఎలా పట్టాడనేదే సినిమా. ఇందులో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించారు. ఎస్ఎల్‌వి సినిమాస్, ఆర్‌టీ సినిమా వర్క్స్ బ్యానర్స్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్య సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే, రవితేజ ఈ సినిమా కాకుండా ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు.
అయితే, కరోనా సమయంలో వాయిదా పడ్డ సినిమాలన్నీ చిన్న, పెద్ద సినిమాలన్నీ ఇటీవలే విడుదలై మంచి విజయాలు సాధించాయి. దీంతో, ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా ఎలాంటి పెద్ద సినిమా లేదు. కానీ రామరావు ఆన్‌డ్యూటీ పదే పదే ఎందుకు వాయిదా పడుతుందనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. ఈ క్రమంలో ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ మూవీ నిర్మాత, హీరో రవితేజకు (Hero Raviteja) మధ్య మనస్పర్థలు తలెత్తడం వ్లలే సినిమా వాయిదా పుడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజా బజ్ ప్రకారం.. మూవీని ప్రారంభించేముందే బిజినెస్‌ను బట్టి హీరో, నిర్మాత, డైరెక్టర్‌ల మధ్య ఓ ఒప్పందం జరిగిందట. ఈ క్రమంలో విడుదలైన మూవీ పోస్టర్లు, టీజర్ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవడంతో బిజినెస్ పరంగానూ థియేట్రికల్ (Theatrical Business), శాటిలైట్, ఓటీటీ హక్కులకు సంబంధించి రామారావు ఆన్‌డ్యూటీ మంచి బిజినెస్ జరిగిందట. దీంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం బిజినెస్‌ను బట్టి తనకు రావాల్సిన వాటా ఇవ్వాలని రవితేజ డిమాండ్ చేశాడని, అయితే ఈ సినిమా కాగితాల వరకు బిజినెస్ జరిగినా ఇంకా చేతికి డబ్బులు అందలేదని ప్రొడ్యూసర్ చెప్పినట్టు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య కాస్తా విభేదాలు తలెత్తాయని, అందుకే పోస్ట్ ప్రొడక్షన్‌లు పనులు వాయిదా పడ్డట్లు సమాచారం. వీరిద్దరు ఒక నిర్ణయానికొస్తే చివరి దశలో ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.