మేజ‌ర్ (Major) చిత్ర యూనిట్‌కు విశాఖ‌లో భారీ స‌ప్రైజ్

Updated on May 31, 2022 07:26 PM IST
 అడవి శేష్ (AdiviSesh) న‌టించిన మేజ‌ర్  (Major)  జూన్ 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
అడవి శేష్ (AdiviSesh) న‌టించిన మేజ‌ర్ (Major) జూన్ 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లోనే మేజ‌ర్ (Major) ఓ కొత్త‌ద‌నానికి తెర లేపింది. సినిమా విడుద‌ల‌కు ముందే ప్రివ్యూ షోల‌ను దేశ వ్యాప్తంగా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అడవి శేష్ (AdiviSesh) న‌టించిన మేజ‌ర్ జూన్ 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  26/11 ముంబై దాడుల్లో పోరాడి త‌న ప్రాణాన్ని త్యాగం చేసిన‌ రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీశారు.  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడ్యూస‌ర్‌గా మేజ‌ర్ చిత్రాన్ని నిర్మించారు.

మేజ‌ర్ రిలీజ్‌కు ముందే ప్రివ్యూ షోలు
మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ చేసిన త్యాగాన్ని ప్ర‌తీ భార‌తీయుడికి తెలియాల‌ని మేజ‌ర్  (Major)  చిత్ర యూనిట్ భావిస్తుంది. అందు కోసం సినిమా రిలీజ్‌కు ముందే ప్రివ్యూ షోల‌ను ప్ర‌ద‌ర్శిస్తుంది. పుణే, జైపూర్, అహ్మాదాబాద్, ఢిల్లీ, లక్నో, బెంగుళూరు, కొచ్చి, ముంబై, హైదరాబాద్ నగరాల్లో వరుసగా ఒక్కోరోజు ఒక నగరంలో ప్రివ్యూ షోలు ప్రదర్శిస్తున్నారు. మే 29 న వైజాగ్‌లో మేజ‌ర్ సినిమాను ప్ర‌ద‌ర్శించారు. దాదాపు 1000 మంది ఈ షోకు వెళ్లారు. వైజాగ్‌లో మేజ‌ర్ చిత్ర యూనిట్‌కు అభిమానులు పూల‌తో స్వాగ‌తం ప‌లికారు.

మేజ‌ర్‌గా అద‌ర‌గొట్టావంటూ అడ‌వి శేష్‌కు ప్ర‌శంస‌లు
మేజ‌ర్  (Major)  సినిమా చూసిన ప్రేక్ష‌కులు ఎమోష‌న‌ల్ అవుతున్నారు. కొంత‌మంది ఆడియ‌న్స్ కండ‌త‌డి పెట్టుకుంటున్నారు. వైజాగ్‌లో సినిమా చూసిన ఓ అభిమాని న‌టుడు అడ‌వి శేష్‌కు పూల మాల వేశారు. సూప‌ర్ యాక్టింగ్ అంటూ అడ‌వి శేష్‌ను ప్ర‌శంసించారు. మేజ‌ర్ ప్రివ్యూ షోల‌కు అభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇక సినిమా రిలీజ్ త‌ర్వాత ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!