ఓటీటీలోకి మాధవన్ (Madhavan) ‘రాకెట్రీ’ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పటి నుంచి అంటే?
ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత ఆధారంగా నటుడు మాధవన్ (Madhavan) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’. జూలై 1వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. సినీ ప్రేమికుల ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
థియేటర్లలో రిలీజై మంచి టాక్ రావడంతో రాకెట్రీ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రాకెట్రీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. జూలై 26వ తేదీ నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది అమెజాన్ ప్రైమ్.
దాదాపుగా రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన రాకెట్రీ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్లు వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు ఓటీటీ సంస్థ అమెజాన్ కూడా ఈ సినిమాను మంచి ధరకే దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
కథేంటంటే:
గూఢచర్య ఆరోపణల్ని ఎదుర్కొని నిరపరాధిగా బయటపడిన ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో నంబి నారాయణన్ చదువుకున్న రోజుల నుంచి, ఆరోపణలు ఎదుర్కోవడం, వాటి నుంచి బయటపడడం వరకు ఈ కథ సాగింది.
రాకెట్ సైన్స్ కోసం నంబి నారాయణన్ చేసిన కృషి, మనదేశం కోసం చేసిన త్యాగాల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు మాధవన్ (Madhavan). ఇక, ఈ సినిమాతో నటుడిగానే కాకుండా దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు వేయించుకున్నారు మాధవన్. సూర్య, షారుఖ్ రాకెట్రీ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాపై సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రశంసల జల్లు కురిపించారు.
Read More : మహేష్‌బాబు (MaheshBabu) ఫ్యాన్స్‌కు బర్త్‌డే గిఫ్ట్..థియేటర్లలో సందడి చేయనున్న ‘ఒక్కడు’ సినిమా!