Happy Birtday Movie: లావణ్య త్రిపాఠి సినిమాకు నాగచైతన్య 'థాంక్యూ' మూవీ ఎఫెక్ట్.. విడుదల తేదీ మారింది!

Updated on Jun 26, 2022 10:49 PM IST
హ్యాపీ బర్త్ డే మూవీ పోస్టర్స్ (Happy Birthday Movie Posters)
హ్యాపీ బర్త్ డే మూవీ పోస్టర్స్ (Happy Birthday Movie Posters)

Happy Birtday Movie: టాలీవుడ్ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌ డే’. ఈ చిత్రాన్ని మత్తువదలరా ఫేమ్, దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

నరేష్‌ అగస్త్య, వెన్నెల కిషోర్‌ (Vennela Kishore), సత్య, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని జులై 15న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఇప్పుడీ చిత్రాన్ని జులై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. "వినోదంతో నిండిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. లావణ్య సరికొత్తగా కనిపించనుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి" అని చిత్ర వర్గాలు తెలిపాయి. 

నిజానికి జులై 8వ తేదీన అక్కినేని నాగచైతన్య ‘థాంక్యూ’ (Happy Birthday Movie) సినిమా విడుదల కావాలి. ఇతర కారణాల వల్ల ఈ చిత్రాన్ని జులై 22కి వాయిదా వేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఇప్పుడు ఆ స్లాట్ ఖాళీ కావడంతో  కాస్త ముందుగా వచ్చేస్తే మంచిదని ‘హ్యాపీ బర్త్‌డే’ బృందం భావించింది. దాంతో, విడుదల తేదీని ముందుకు మార్చుకుంది. 

ఈ చిత్రంలోని పాత్రలు, కథ  భిన్నంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటాయని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ (Happy Birthday Teaser) వైవిధ్యంగా ఉండి ఆసక్తిగా ఉంది. ప్రధాన క్యారెక్టర్స్ కూడా సరికొత్తగా ఉండి ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించింది. ఇక, ఈ చిత్రానికి సంగీతం కాలభైరవ అందించాడు. కెమెరా: సురేష్‌ సారంగం, లైన్‌ ప్రాడ్యూసర్‌: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాబా సాయి, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ. ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కుమార్ కందుల, మార్కెటింగ్: ఫస్ట్‌షో, పీఆర్‌ఓ:-వంశీ శేఖర్,  మడూరి మధు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: రితేష్ రానా.

Read More: నో గన్.. నో ఎంట్రీ : ఆసక్తి రేకెత్తిస్తున్న లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా టీజర్‌‌ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!