నో గన్.. నో ఎంట్రీ : ఆసక్తి రేకెత్తిస్తున్న లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా టీజర్‌‌ !

Updated on Jun 07, 2022 05:56 PM IST
‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా పోస్టర్
‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా పోస్టర్

‘మత్తు వదలరా’ సినిమాతో ప్రేక్షకుల అటెన్షన్‌ను తనవైపు తిప్పుకున్నాడు రితేశ్‌ రానా. రితేశ్‌ దర్శకత్వంలో ఇప్పుడు వస్తున్న మరో సినిమా ‘హ్యాపీ బర్త్‌డే’. టైటిల్‌ కామన్‌గానే ఉన్నా.. టీజర్‌‌ మాత్రం డిఫరెంట్‌గా ఉంది. సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా టీజర్‌‌ను డిజైన్ చేసింది చిత్ర యూనిట్. ‘హ్యాపీ బర్త్‌డే’ కథను కూడా డైరెక్టర్‌‌ రితేశ్‌.. ‘మత్తు వదలరా‘ సినిమాలాగే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కించాడని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టీజర్‌‌ మంగళవారం రిలీజైంది.

జూలై 15వ తేదీన ‘హ్యాపీ బర్త్‌డే‘ సినిమాను రిలీజ్‌ చేస్తుండడంతో.. సినిమా ప్రమోషన్స్‌ ప్రారంభించింది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే మంగళవారం సినిమా టీజర్‌‌ను రిలీజ్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఆయుధాల చట్టం అంటే? అనే డైలాగ్‌తో  ప్రారంభమైన టీజర్‌‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వెన్నెల కిషోర్ మరోసారి తన మార్కు కామెడీతో నవ్వులు పూయించడానికి రెడీ అయ్యాడని టీజర్‌‌ చూస్తేనే తెలుస్తోంది. ‘నేను టెన్త్‌ ఫెయిల్‌ అయ్యి ఉండొచ్చు..కానీ గన్‌ బిల్లు మాత్రం పాస్‌ చేసే తీరుతాను..’ అని వెన్నెల కిషోర్‌‌ బల్లగుద్ది మరీ డైలాగ్ చెప్పడం బాగుంది. 

పబ్‌లో గన్‌ పేలుస్తున్న లావణ్య..

టీజర్‌‌లో కనిపించే కొన్ని క్యారెక్టర్స్‌ గన్‌ పట్టుకుని కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని క్యారెక్టర్లు ఆ గన్స్ గురించి మాట్లాడుకుంటున్నాయి. దీని ప్రకారం చూస్తే సినిమా కథ మొత్తం గన్స్‌, గన్‌ కల్చర్‌‌ చుట్టూ తిరుగుతుందని అర్ధమవుతోంది. వెన్నెల కిషోర్‌తోపాటు సత్య తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక, టీజర్‌‌లో లావణ్య త్రిపాఠి ‘గన్‌‘ పేలుస్తూ ఒక పబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఆయుధాల చట్టాన్ని ఎవరు అమలు చేశారు? ‘బర్త్‌ డే’ సెలబ్రేషన్స్‌కి గన్స్‌కి ఏంటి సంబంధం? అనే విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

ఇక, అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకుంది. కొంతకాలంగా తెలుగు ప్రేక్షకులకు దూరమైన లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ‘హ్యాపీ బర్త్‌డే‘ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది.

 

Read More: రవితేజ చెల్లెలిగా జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా?.. వైరల్ అవుతున్న న్యూస్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!