నాగ చైత‌న్య (Naga Chaitanya), ప‌రుశురామ్ కాంబోలో వ‌స్తున్న సినిమా పేరు 'నాగేశ్వరరావు' !

Updated on May 28, 2022 11:07 PM IST
నాగ‌ చైత‌న్య  (Naga Chaitanya) త‌న తాత పేరు నాగేశ్వ‌ర‌రావు అనే టైటిల్‌తో సినిమా రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట.
నాగ‌ చైత‌న్య (Naga Chaitanya) త‌న తాత పేరు నాగేశ్వ‌ర‌రావు అనే టైటిల్‌తో సినిమా రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట.

టాలీవుడ్‌లో నాగ‌చైత‌న్య (Naga Chaitanya) ఇమేజే వేరు. డిఫెరెంట్ క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతారు. నాగ‌చైత‌న్య ఓ కొత్త సినిమా ప్రాజెక్ట్‌ను, ఓ  స్టార్ డైరెక్ట‌ర్‌తో చేస్తున్నారు. అందులో భాగంగా,  త‌న తాత పేరుతో 'నాగేశ్వ‌ర‌రావు' అనే టైటిల్‌తో ఓ సినిమా రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా 'నాగేశ్వ‌ర‌రావు' సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ట‌.ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య  'థాంక్యూ' సినిమాలో న‌టిస్తున్నారు. థాంక్యూ చిత్రం జూలై 8 న రిలీజ్ కానుంది. ఈ సినిమా త‌ర్వాత నాగ చైత‌న్య‌ (Naga Chaitanya) వెంక‌ట ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నారు. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లోనూ ఆ సినిమా తెరకెక్కిస్తారని టాక్. 

ప‌రుశురామ్ పెట్ల ఈ మ‌ధ్య విడుద‌లైన 'స‌ర్కారు వారి పాట' సినిమా ద‌ర్శ‌కుడిగా స్టార్ డ‌మ్ సంపాదించుకున్నారు.  మ‌హేష్ బాబుకు బ్లాక్ బాస్ట‌ర్ సినిమా అందించారు. ఇక ప‌రుశురామ్ 'స‌ర్కారు వారి పాట' సినిమా త‌ర్వాత, అక్కినేని నాగ చైత‌న్య  (Naga Chaitanya) తో ఓ సినిమా తీస్తున్నారు. ఇదే క్రమంలో, నాగ చైత‌న్య 20వ సినిమాకు 'నాగేశ్వ‌ర‌రావు' అనే టైటిల్ ఫిక్స్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇటీవలే నాగ చైత‌న్య న‌టించిన 'ల‌వ్ స్టోరి' హిట్‌గా నిలిచింది. అయితే, నాగ చైత‌న్య కూడా ఓ మంచి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ప‌రుశురామ్ డైరెక్ష‌న్‌లో కొత్త క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. 

ప‌రుశురామ్ 'స‌ర్కారు వారి పాట' సినిమా త‌ర్వాత అక్కినేని నాగ చైత‌న్య  (Naga Chaitanya) తో ఓ సినిమా తీస్తున్నారు.

నాగేశ్వ‌ర‌రావు క‌థేంటి?
ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య న‌టించే సినిమాకు 'నాగేశ్వ‌ర‌రావు' (Nageswara Rao) అనే టైటిల్ బాగుంటుంద‌ని టాక్. 14 రీల్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య ఓ మధ్య తరగతి యువకుడిగా న‌టించ‌నున్నారు. ఓ కార్పొరేట్ కంపెనీకి సీఈఓ ఉన్న తను, అనుకోకుండా  హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడ‌ట‌. ఆ ప్రేమ క‌థ ఎలా సాగుతుంద‌నే స్టోరితో సినిమాను తెరకెక్కిస్తున్నారు ప‌రుశురామ్. ఈ సినిమా స్కిప్ట్ వ‌ర్క్ ఇంకా జ‌రుగుతుంది. అలాగే త‌ర్వ‌లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 

స‌మంత‌తో విడాకుల త‌ర్వాత, నాగ చైత‌న్య సినిమాల‌పై దృష్టి పెట్టారు. సినిమాల‌తో పాటు ఓటీటీలో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. విక్ర‌మ్ కె కుమార్ డైరెక్ష‌న్‌లో 'దూత' వెబ్ సిరీస్‌లో చైతూ లీడ్ రోల్ చేస్తున్నారు. దూత హ‌ర్ర‌ర్ వెబ్ సిరీస్‌గా స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఇటు సినిమాలు, అటు వెబ్ సిరీస్‌ల‌తో నాగ చైత‌న్య బిజీగా మారారు. ఏదేమైనప్పటికీ, నాగ చైత‌న్య (Naga Chaitanya) కొత్త సినిమాల‌కు ప్రేక్ష‌కులు ఏ రేంజ్ హిట్ ఇస్తారో వేచి చూడాలి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!