Bigg Boss Sohel & SV Krishna Reddy - కథ వేరుంటది.! కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో.. హైబ్రిడ్ అల్లుడిగా సొహైల్

Updated on Apr 20, 2022 09:57 AM IST
చాలా భాషల్లో లాగానే తెలుగులో కూడా పాపులారిటీ సంపాదించుకున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో కంటెస్టెంట్‌ సోహైల్‌తో కృష్ణారెడ్డి సినిమా చేస్తున్నారు.
చాలా భాషల్లో లాగానే తెలుగులో కూడా పాపులారిటీ సంపాదించుకున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో కంటెస్టెంట్‌ సోహైల్‌తో కృష్ణారెడ్డి సినిమా చేస్తున్నారు.

ఫ్యామిలీ డైరెక్టర్ ఎస్‌వీ కృష్ణారెడ్డి కొత్త వాళ్లతో మరో ప్రయోగం చేయబోతున్నారు. ఇప్పటికే పలు ప్రయోగాలు చేసి హిట్‌లు అందుకున్న ఈ సీనియర్ డైరెక్టర్‌‌ చాలా కాలం నుంచి సరైన హిట్‌ కోసం వేచి చూస్తున్నారు. చాలా భాషల్లో లాగానే తెలుగులో కూడా పాపులారిటీ సంపాదించుకున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో కంటెస్టెంట్‌ సోహైల్‌తో కృష్ణారెడ్డి సినిమా చేస్తున్నారు.

ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు అనే టైటిల్‌ను కూడాఈ సినిమాకు డిసైడ్‌ చేసినట్టు ప్రకటించారు . సోహైల్‌తోపాటు నటకిరీటి రాజేంద్రప్రసాద్, సునీల్, వరుణ్‌ సందేశ్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 

ఫ్యామిలీ డైరెక్టర్ ఎస్‌వీ కృష్ణారెడ్డి కొత్త వాళ్లతో మరో ప్రయోగం చేయబోతున్నారు.

ఆర్గానిక్‌ మామ -  హైబ్రిడ్‌ అల్లుడు .. ఈ చిత్రం పేరుకు తగ్గట్టుగానే ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌ అని తెలుస్తోంది.  కృష్ణారెడ్డి వినూత్న సినిమాల దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. ఆయన తీసిన యమలీల, శుభలగ్నం, ఆహ్వానం, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, వినోదం, పెళ్లాం ఊరెళితే లాంటి సినిమాలు సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. అయితే, 2014లో కృష్ణారెడ్డి తీసిన యమలీల–2 సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఇక,  సోహైల్‌ హీరోగా మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్‌కట్‌ బాలరాజు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. 

కృష్ణారెడ్డి వినూత్న సినిమాల దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!