బిగ్ బాస్ తెలుగు ఓటీటీ (Bigg Boss Telugu OTT) : ఈ రోజు ఎపిసోడ్‌లో కిల్లర్.. ఎవరంటే?

Updated on Apr 26, 2022 05:27 PM IST
Ashu Reddy & Akhil Sartak
Ashu Reddy & Akhil Sartak

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో విజయవంతంగా ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో దీనిని 24గంటల నాన్ స్టాప్ షోగా ఇటీవల ప్రారంభించారు. ఇప్పటివరకు 8వారాలు పూర్తయి.. తాజాగా తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. గతవారం హౌస్ నుంచి అజయ్ కతుర్వార్ ఎలిమినేట్ అయ్యాడు.

అయితే, తాజాగా ఈ వారానికి సంబంధించి ఓ ప్రోమో విడుదలైంది. ఇందులో బిగ్ బాస్.. ఇంటి సభ్యులకు సర్ ప్రైజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆసక్తికర టాస్క్ ఇచ్చి‘కిల్లర్ ఉన్నాడు జాగ్రత్త’అంటూ హెచ్చరించాడు. ఒక్కొక్క ఇంటి సభ్యుణ్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచి పలు రకాల ప్రశ్నలు సంధించాడు.

అలాగే యాంకర్ శివను ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఎంత అని అడగ్గా, ఆయన తడబడి చివరికి తెలియదని చేతులెత్తేశాడు.

బాబా భాస్కర్, శివ, అషురెడ్డిలను "మీరే కిల్లర్" అని అడుగుతూ.. కాస్త గ్యాప్ ఇచ్చాడు. వారు సంబరపడిపోతుండగా కాదు అని చెప్పేసి షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో, నటరాజ్ మాస్టర్, బాబా భాస్కర్ మధ్య కాస్త ఫన్ జనరేట్ అయ్యింది. ప్రోమో చివర్లో హౌస్లో భయంకరంగా అరుపులు వినిపించడంతో అందరూ ఒక్కచోటకు చేరగా.. అక్కడ ఉన్న అద్దంపై ‘నటరాజ్ డెడ్’ అని ఉండడంతో అందరూ షాక్ అయ్యారు.

ఇక, వెంటనే అది ఎవరో కనిపెట్టాలి అని అఖిల్ నటరాజ్ మాస్టర్ తో అనడంతో ప్రోమో ముగుస్తుంది. అయితే ఆ కిల్లర్ ఎవరనేది తెలియాలంటే మంగళవారం రాత్రి 9 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో నేటి ఎపిసోడ్ ను చూడాల్సిందే.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!