Ariyana Glory: త్వ‌ర‌లో బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా పెళ్లి.. వ‌రుడు రెడీ?

Updated on May 22, 2022 01:50 PM IST
బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా (Ariyana Glory)
బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా (Ariyana Glory)

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న‌ బిగ్ బాస్ నాన్ స్టాప్ షో (BiggBoss Nonstop) నిర్వాహకులు, ఈ సీజన్‌లో శాంతి అనే ఓ ఆస్ట్రాలజర్‌ను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపారు. ఈ సంద‌ర్భంగా ఆమె అరియానా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వివాహం ఎప్పుడవుతుందో తెలియజేయమని,  అరియానా (Ariyana Glory) ఆమెను అడగ్గా.. ఆస్ట్రాలజర్ ఆసక్తికరమైన సమాచారాన్ని అందించారు. 

అరియానాకు లవర్స్ కార్డ్ రావడంతో.. ‘ఈ నవంబర్‌లో ఆమె పెళ్లి కావచ్చని, అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడని.. కొత్త ఇంటితో పాటు.. కొత్త లైఫ్ కూడా అరియానా కోసం వేచి చూస్తుందని.. ఆమె జీవితం ఫుల్ సెలబ్రేషన్స్‌కే అంకితం కాబోతుందని" అరియానాకు జాతకం చెప్పేశారు శాంతి.

గ్లామ‌ర్ డాల్ అరియానా గురించి అందరికీ తెలిసిందే. తొలుత ఆర్జీవి ఇంటర్వ్యూ వల్ల ఫేమస్ అయిన ఆమె.. ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా దక్కించుకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ షో వల్ల యాంకర్ అరియానా (Ariyana Glory) జీవితంలో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె ముక్కుసూటిగా మాట్లాడేతనం, చాలామందికి నచ్చుతోంది కూడా. ఆపై ఆమెకు గ్లామర్ యాంగిల్ కూడా భారీగానే ఉంది. బిగ్ బాస్ నాన్ స్టాప్‌లోకి వెళ్ల‌క ముందు అరియానా గ్లోరీ, అషు రెడ్డి (Ashu Reddy) ఛానల్ నిర్వహిస్తున్న ఓ స్పెషల్ షోలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా అరియానా స‌న్న‌ని నడుమును చూసిన అషు రెడ్డి,  వెంటనే తనకు ముద్దు కూడా పెట్టేసింది. దీంతో అరియానా నడుముకు, అషు ముద్దు పెడుతున్న ఫోటో.. అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ త‌ర్వాత‌ వీరిద్దరు చేసిన ఈ పనిపై, పలువురు నెటిజన్లు మండిపడ్డారు. "మహిళలు అయ్యి ఉండి.. ఇవేం పనులు" అంటూ సోషల్ మీడియా వేదికగానే ప‌లు విమర్శలు కూడా చేశారు.
 

అరియానా, అషు రెడ్డి (Ariyana Glory, Ashu reddy)

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అయిన అరియానా (Ariyana Glory,) ఆ సీజన్ లో ఇతర కంటెస్టెంట్లకు గట్టిగానే పోటీనిచ్చింది. దీంతో పాటు సోషల్ మీడియా ఫాలోవర్లను కూడా బాగానే పెంచుకుంది. అయితే, కొన్ని విషయాలలో అరియానా బోల్డ్‌గా ఉంటారన్న‌ విమర్శ కూడా ఉంది. అయినా ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ప్ర‌స్తుత సీజ‌న్‌లో టాప్ 7 కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్న‌ అరియానా, బిగ్ బాస్ ఓటీటీ తెలుగు విన్నర్‌గా నిలవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యూట్యూబ్ యాంకర్ స్థాయి నుంచి బిగ్ బాస్ పుణ్యమా అని పెద్ద స్టార్ అయిపోయారు అరియానా.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!