హాట్ హాట్ ఫొటోల‌తో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ (Alekhya Harika) దేత్త‌డి హారిక!

Updated on May 11, 2022 07:52 PM IST
దేత్త‌డి హారిక (Dethadi Harika)
దేత్త‌డి హారిక (Dethadi Harika)

బిగ్ బాస్ ఫేమ్, దేత్త‌డి హారిక (Alekhya Harika) రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతున్నారు. పొట్టి పొట్టి బట్టలు ధరించి హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. బ‌ట్ట‌ల విష‌యంలో ఆమె తెగింపు చూసి కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ అవుతోంది. హారిక అందాల‌కు సోషల్ మీడియా సైతం షేక్ అవుతుంది. కాగా, సినీ పరిశ్రమలో నటిగా ఎదగాలంటే గ్లామర్ షో తప్పని సరి అన్న సంగ‌తి తెలిసిందే. అలేఖ్య హారిక సైతం ఆ కలలతోనే ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అందుకే హారిక‌ (Alekhya Harika) గ్లామర్ ఫార్ములా పాటిస్తున్నట్లుంది. 

టాలీవుడ్ లో ఓ తెలుగు హీరోయిన్ కావడమే తన లక్ష్యం అన్నట్లు.. హారిక ఆ దిశగా సీరియస్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఒకప్పుడు హారిక కేవలం యూట్యూబ్ ప్రేక్షకులకు మాత్రమే పరిచయం. దేత్తడి హారిక అనే బ్రాండ్ నేమ్ తో ఆమె చేసిన‌ వీడియోలు చాలా ఫేమస్ అయ్యాయి. ఫక్తు తెలంగాణా బిడ్డ‌గా రూడ్ అండ్ రఫ్ బిహేవియర్ చూపిస్తూ తెలంగాణా స్లాంగ్ లో రెచ్చిపోయేది హారిక. అలా సంపాదించిన ఫేమ్ ఆధారంగానే ఆమెకు బిగ్ బాస్ (Bigg boss telugu) షోకు ఎంపికయ్యే ఛాన్స్ వ‌చ్చింది. అయితే, రాక‌రాక‌ వచ్చిన ఛాన్స్ ను చక్కగా ఉపయోగించుకున్న హారిక తన ఇమేజ్ ను రెట్టింపు చేసుకుంది. 

 

దేత్త‌డి హారిక (Dethadi Harika)

అనామ‌కురాలిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారి బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ కి చేరింది. గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీస్ లో ఆమె అబ్బాయిలతో పోటీపడి మరీ గెలిచేవారు. అలాగే హౌస్ లో ఆ సీజన్ విన్నర్ అభిజీత్ తో ఆమె రొమాన్స్, లవ్ ట్రాక్ హైలైట్ అయ్యాయి. టాస్క్ లో భాగంగా గేమ్ కోసం ఏకంగా జుట్టు కత్తిరించుకున్న హారిక, హౌస్ లో పొట్టి బట్టలలో గ్లామర్ షోకి తెరలేపారు. దీంతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో టాప్5 లో 5వ స్థానం దక్కించుకున్న హారిక... ఆ ఫేమ్ తో వరుసగా వెబ్ సిరీస్ లు చేయ‌డం స్టార్ట్ చేసింది. ఆ మ‌ధ్య‌ ఆమె హీరోయిన్ గా ఏవండోయ్ ఓనర్ గారు అనే వెబ్ సిరీస్ చేసింది. అలాగే మరికొన్ని వెబ్ సిరీస్ లో ఆమె నటిస్తున్నారు.

అయితే ఇన్ స్టాగ్రామ్ వేదికగా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది హారిక. త‌న‌ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతోంది. దీంతో హారిక ఫోటో షూట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ త‌న ఫొటోల‌కు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ మ‌ధ్య‌ చాలా కాలం తర్వాత హారిక బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ ని కలిసింది. వీరితో ఆ సీజన్ కంటెస్టెంట్ సింగర్ నోయల్ కూడా ఉన్నాడు. హౌస్ లో నోయల్, అభిజీత్, హారిక, లాస్య ఒక టీమ్ గా ఉండేవారు. తమ టీం నుంచి అభిజీత్ కి తోడుగా నిలిచి వారు అత‌న్ని విన్నర్ గా చేసుకున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!