బాలీవుడ్ (Bollywood) 'అడల్టింగ్' వెబ్ సిరీస్ తెలుగులో రీమేక్.. హీరోయిన్లు ఎవ‌రంటే!

Updated on May 14, 2022 03:59 PM IST
సిరి హ‌న్మంతు, ర‌మ్య పసుపులేటి (Siri Hanmanth, Ramya Pasupuleti)
సిరి హ‌న్మంతు, ర‌మ్య పసుపులేటి (Siri Hanmanth, Ramya Pasupuleti)

తెలుగులో బిగ్ బాస్ (BiggBoss Nonstop) రియాలిటీ షో ఎంత స‌క్సెస్ అయిందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. గ‌త సీజ‌న్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన‌ సిరి హనుమంతు (Siri Hanmanth) ఆ త‌ర్వాత చాలా ఫేమ‌స్ అయింది. బిగ్‌బాస్‌లో యూట్యూబ‌ర్ షణ్ముఖ్‌తో కలిసి రొమాన్స్‌తో మీడియా హెడ్‌లైన్స్‌ను ఆకర్షించింది. ఈ మేర‌కు సోషల్, మీడియా మీడియా పతాక శీర్షికలను ఆకర్షించింది. ఇక‌, బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చోటు చేసుకొన్న కొన్ని పరిణామాలతో గత కొద్దికాలంగా సిరి హన్మంతు మీడియాకు దూరంగా ఉంటే వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో ఇటీవల బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (BiggBoss Nonstop) వేదికపై హోస్ట్ నాగార్జున సరసన మెరిసింది. ఇప్పుడిప్పుడే కెరీర్‌ గ్రాఫ్‌ను పెంచుకొనే ప్రయత్నం చేస్తున్న ఈ బ్యూటీకి తాజాగా క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ వ‌చ్చింది. ఓ క్రేజీ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్దమైందనే వార్త ఇప్పుడు మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వెబ్ సిరీస్ లో సిరితో పాటు మ‌రో ముద్దుగుమ్మ రేష్మా పసుపులేటి న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 

అయితే.. వెబ్ సిరీస్ (Web Series), షార్ట్ ఫిలిం లతో సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన వీరిద్దరూ కలిసి 'బీఎఫ్ఎఫ్' అనే కొత్త వెబ్ సిరీస్ లో నటించబోతున్నారట‌. బాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న 'అడల్టింగ్' అనే వెబ్ సిరీస్‌ను తెలుగు ఓటిటి సంస్థ ఆహా 'బీఎఫ్ఎఫ్' గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అయేషా ఆహ్మద్, యశష్మిని దయానా, విరాజ్ గెహ్లానీ తదితరులు నటించారు. అయితే ఈ వెబ్ సిరీస్ గురించి త్వ‌ర‌లో ఓ అధికారిక ప్రకటన వెలువడనున్నది. తెలుగులో సిరి హనుమంతు, రేష్మా పసుపులేటి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎఫ్ఎఫ్ టీం మొత్తం పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్.. " నేటి యువతరానికి అద్దం పట్టే ఈ వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది" అని పేర్కొన్నారు. స్వతంత్ర భావాలు కలిగిన ఇద్దరు యువతుల జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మే 20 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

 

'బీఎఫ్ఎఫ్' పోస్ట‌ర్ (BFF Poster)

ముంబయి న‌గ‌రంలో ఆ ఇద్ద‌రు యువ‌తులు అక్క‌డి పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారనే కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. కాగా, ఈ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచులు, సెంటిమెంట్స్‌కు తగినట్టుగా మార్పులు చేర్పులు చేశారు. రేష్మా ప‌సుపులేటి.. తెలుగు, తమిళ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. లవ్, వంశం, పాగల్ నిలవు, భాగ్యలక్ష్మి సీరియల్స్ నటించారు. ఇక సిరి హన్మంతు (Siri Hanmanth) కెరీర్ విషయానికి వస్తే.. య్యూట్యూబ్‌లో మేడమ్ సార్.. మేడమ్ అంతే, గండరగోపాలం, రామ్‌లీలా సీరిస్‌లో నటించింది. ఎవరే నువ్వు మోహిన, అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్స్‌లో ప్రేక్షకులను మెప్పించింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!