BIGG BOSS NONSTOP: బిగ్ బాస్ బ‌జ్ ఎపిసోడ్‌లో యాంకర్ ర‌వి, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌ల మ‌ధ్య వాగ్వాదం

Updated on May 18, 2022 09:50 PM IST
యాంకర్ ర‌వి, న‌ట‌రాజ్ మాస్ట‌ర్ (Anchor Ravi, Natraj Master)
యాంకర్ ర‌వి, న‌ట‌రాజ్ మాస్ట‌ర్ (Anchor Ravi, Natraj Master)

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీలో ప్ర‌సార‌మ‌వుతున్న తెలుగు బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో (BiggBoss Nonstop) చివరి దశకు చేరుకుంది. టైటిల్‌ను గెలిచేందుకు ఇంట్లో మిగిలిన‌ హౌజ్‌మేట్స్ అంద‌రూ గట్టిగా పోటీ పడుతున్నారు. ఇక గతవారం హౌస్‌మేట్స్‌ అందరూ నామినేషన్‌లో ఉన్నారు. బిందు మాధ‌వి, అఖిల్‌, బాబా బాస్కర్‌, నటరాజ్‌ మాస్టర్‌, ఆరియానా గ్లోరీ, మిత్రా శ‌ర్మ‌, అనిల్‌, యాంకర్‌ శివ నామినేషన్‌లో ఉండగా, ఇందులో తక్కువ ఓట్స్‌ వచ్చిన నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట‌యి హౌస్‌ను వీడాడు.

ఇక‌, ఎలిమినేషన్‌ అనంతరం ప్ర‌తీ హౌస్ మేట్ బిగ్‌బాస్‌ బజ్‌ ఎపిసోడ్‌లో పాల్గొనడం ఆన‌వాయితీ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ వారం కూడా నటరాజ్ మాస్ట‌ర్ యాంకర్‌ రవితో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఇటీవ‌ల‌ే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ రిలీజ్ చేయ‌గా.. తాజాగా ఫుల్ ఎపిసోడ్ విడుద‌లైంది. 

మాస్ట‌ర్ ఇంట‌ర్వ్యూ కోసం వ‌స్తూనే ‘నా రాక కోసం ఎదురు చూస్తున్నావా?’ అని రవికి కౌంటర్‌ ఇచ్చాడు. ‘తాను ఒక్కడినే ఎదురు చూస్తున్నానుకుంటే అది మీ తప్పు’ అంటూ రవి రీకౌంటర్‌ ఇచ్చాడు. అనంతరం, ‘ఒకరి వల్లే ఇంటి నుంచి మధ్యలోనే బయటకు వచ్చాననడంతో అంత నెగిటివిటీ’ ఎందుకు మాస్టర్‌ అని రవి అంటాడు.

ఆ తర్వాత బిందు మాధ‌విపై ‘చెన్నై.. తమిళ్‌.. చేసుకుని వెళ్లిపోతారు’ అంటూ నటరాజ్ చేసిన‌ వ్యాఖ్యలను రవి తప్పుబట్టాడు. దీనికి స‌మాధానంగా మాస్టర్, ఆ విష‌యంలో కూడా క్లారిటీ ఇస్తానంటాడు. ఆ తర్వాత మాస్టర్‌ తనకు ఒక సక్సెస్‌ అనేది రాలేదన‌డంతో.. టాలెంట్‌కి హ‌ద్దులు లేవు అంటాడు రవి.

అనంతరం న‌ట‌రాజ్ మాస్టర్‌ (Natraj Master) రవిపై ఫైర్ అవుతూ.. ‘నువ్వు ఏదో లోపల పెట్టుకుని, ఒక పాయింట్స్‌ రాసుకుని నా మీద అటాక్‌ చేస్తున్నావ్. ప్రతీ పాయింట్‌ అర్థమవుతుంది’ అని అన్నాడు. ఇలా ఇద్దరి మధ్య సంభాషణ కాస్తా ఘాటూగానే సాగింది.

ఆ తర్వాత బిందు మాధ‌విని ఉద్దేశిస్తూ.. ‘ఇన్ని క్రూరమైన ఆలోచనలు గల ఏ అమ్మాయినీ చూడలేదని’ అంటాడు. ‘ఆమె తీసే పాయింట్స్‌’ అంటూ నటరాజ్‌ మాస్టర్‌ అంటుండగా ‘ఈ రోజు బిందు పాయింట్స్‌ తీసింది కాబట్టే తనకు.. ఆడియన్స్‌ బిందు లోపల‌ ఉండాలని ఓట్‌ వేశారు’ అంటాడు రవి. ఆ వెంటనే ‘శకుని అనే ఓ నెగిటివ్‌ క్యారెక్టర్‌ పేరు, ఒక అమ్మాయికి పెట్టడం ఎంతవరకు కరెక్ట్‌ అని అడగ్గా.. ఆడించేది ఎవరు మహా భారతంలో శకుని.. బిగ్‌బాస్‌లో ఆ ఇద్దర్ని ఆడిస్తున్నావంటే నువ్వు శకునే కదా’ అని సమాధానం ఇస్తాడు మాస్టర్‌.

ఇక ‘అరియానకు (Ariyana Glory) ఇంటి డబ్బులు వచ్చాయి. ఇంటికి పంపించేయండి అని అనడం ఏంటని అన్నదానికి.. బిడ్డ మీద ఒట్టు వేయమంటే గేమ్ అయినా వదిలేస్తాను.. కానీ ఒట్టు వేయను’ అంటాడు నటరాజ్‌ మాస్టర్‌. ఇక ‘నువ్వు బాగానే ప్రిపేర్ అయిన‌ట్లున్నావ్.. అర్థమైందంటూ‘ రవిపై మాస్టర్ సెటైరికల్‌ కామెంట్స్‌ చేస్తాడు. దీనికి రవి తాను ‘చాలా బెటర్‌గా మాట్లాడుతున్నానని, బయటకు వెళ్లి చూస్తే మీరు చాలా బాధపడతారని‘ సమాధానం ఇవ్వడం ఆసక్తి నెలకొంది. ఈ ఇంటర్య్వూలో రవి నటరాజ్‌ మాస్టర్‌ను ఎలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు.. నటరాజ్‌ మాస్టర్‌ ఎందుకు అంత అసహనానికి లోనయ్యాడనేది తెలియాంటే ఫుల్‌ ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!