జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR): యంగ్ టైగర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Updated on May 11, 2022 07:55 PM IST
ర‌టాల శివ, ఎన్టీఆర్ కాంబోలో  ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ స‌ప్రైజ్‌గా  రిలీజ్ చేయ‌నున్నారు.
ర‌టాల శివ, ఎన్టీఆర్ కాంబోలో  ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ స‌ప్రైజ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

ఆర్ఆర్.ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR). ప్రస్తుతం కొర‌టాల శివ,  జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో .. ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఇదే క్రమంలో ఈ కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్‌ను స‌ర్‌ప్రైజ్‌గా  రిలీజ్ చేయ‌నున్నారు నిర్మాతలు. 

కొమ‌రం భీముడో అంటూ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో, ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్‌కు చాలా మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) నటించిన  "రౌద్రం ర‌ణం రుధిరం" - RRR  సినిమాలో ఆయన తన న‌ట విశ్వ‌రూపం చూపించార‌ని విమర్శకులు సైతం ప్రశంసించారు. అది ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటూ కితాబునిచ్చారు. క‌ళాత‌ప‌శ్వి కె విశ్వ‌నాథ్ అంతటి మేటి దర్శకులు కూడా ఎన్టీఆర్ న‌ట‌నను కొనియాడారు. 

ప్రస్తుతం  జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) తన  30వ సినిమాను కొర‌టాల శివ‌తో చేయ‌నున్నారు. "జ‌న‌తా గ్యారేజ్" సినిమా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిందే. ఈ కొత్త సినిమాలో దర్శకుడు ఎన్టీఆర్‌ను కొత్త లుక్‌లో చూపించనున్నారు. 

Jr NTR

 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్-కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తారక్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా నుంచి త్వరలోనే ఓ సర్ ప్రైజ్ రానుందని తెలుస్తోంది.

ఆచార్య సినిమా అందించిన అపజయంతో, కొర‌టాల శివ ఫైనాషియ‌ల్‌గా డౌన్ ఫాల్‌లో ఉన్నారు. తన ఆర్థికపరమైన లావాదేవీలు అన్ని కూడా ఒక కొలిక్కి వచ్చాకే ఈ సినిమా చేస్తాన‌ని కొరటాల.. ఎన్టీఆర్‌కు చెప్పారని టాక్. జూన్‌లో క్లాప్ కొట్టి, ఆగ‌స్టు నుంచి సెట్స్‌పైకి ఎన్టీఆర్ 30 వ సినిమా వెళ్ల‌నుంది. 

అలాగే ఎన్టీఆర్ పుట్టిన‌రోజున అభిమానుల‌కు ప్ర‌శాంత్ నీల్ ఓ స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వంలో వ‌స్తున్న‌ ఎన్టీఆర్ 31 సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయాల‌ని ఆయన యోచిస్తున్నారు. అందులో భాగంగానే, ఎన్టీఆర్ బ‌ర్త్ డే సందర్భ్ంగా మే 20 న ప్ర‌శాంత్ నీల్ తీసే సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేస్తార‌ట‌.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!