బాలీవుడ్‌ను టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)

Updated on Apr 27, 2022 01:58 PM IST
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(RGV) సోష‌ల్ మీడియాలో జెర్సీ సినిమాపై కామెంట్ చేశారు. బాలీవుడ్ సినిమాల‌పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. రీమేక్‌ల‌పై ఆర్జీవీ ఎందుకు అలా అన్నారు..

బాలీవుడ్ సినిమాల‌పై ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ(RGV) కామెంట్ చేశారు. తెలుగులో నాని న‌టించిన సినిమా జెర్సీని హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమా రీమేక్‌పై  రామ్ గోపాల్ వ‌ర్మ స్పందించారు. జెర్సీ సినిమా హిందీలో డ‌బ్ చేస్తే ప‌ది ల‌క్ష‌లే ఖ‌ర్చు అవుతుంద‌ని... కానీ రీమేక్ చేయ‌డం వ‌ల్ల వంద కోట్ల రూపాల‌య‌లు ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చింద‌న్నారు. అంతేకాకుండా టైం,. ఆర్టిస్టుల క‌స్టం కూడా వేస్ట్ అన్నారు. రీమేక్ బ‌దులుగా కేజీఎఫ్2 లాగా సినిమాల‌ను డ‌బ్ చేసి రిలీజ్ చేస్తే బెట‌ర్ అంటూ రామ్ గోపాల్ వ‌ర్మ త‌న అభిప్రాయాన్ని చెప్పారు. 

నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషనల్ వచ్చిన సినిమా ‘జెర్సీ’. ఈ చిత్రం తెలుగులో 2019లో రిలీజ్ అయింది. జాతీయ స్థాయి అవార్డు అందుకుంది. ద‌ర్శ‌కుడు గౌత‌మ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డను సాధించారు.  ప్ర‌స్తుతం ఈ సినిమాను హిందీలో సేమ్ టైటిల్‌తో హీరో షాహిద్ కపూర్ హీరోగా రిలీజ్ చేశారు. అయితే హిందీ వెర్షన్ కు అంతగా ఆదరణ లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

Jersey

హిట్ కొట్టిన సినిమాల‌ను రీమేక్ చేయాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని.. డ‌బ్ చేస్తే స‌రిపోతుంది క‌దా అని రామ్ గోపాల్ వ‌ర్మ(RGV) అంటున్నారు. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 వంటి డబ్బింగ్ చిత్రాలను బాలీవుడ్ ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాది సినిమాలు రీమేక్ హ‌క్కుల‌ను ఎవ‌రూ అమ్మ‌డం లేదు. బాలీవుడ్‌లో ప్ర‌స్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు ఎలా తీయాలో తెలియ‌డంలేదు. సౌత్ సినిమాల‌ను రీమేక్ చేస్తూ బాలీవుడ్ ముందుకు సాగ‌లేద‌ని రామ్ గోపాల్ వ‌ర్మ త‌న‌దైన స్టైల్‌లో ట్వీట్ చేశారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!