కేజీఎఫ్ 2 (KGF 2) హీరో యశ్ పై .. వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్న అభిమాని

Updated on May 02, 2022 12:12 PM IST
ప్రస్తుతం కేజీఎఫ్ హీరో యశ్‌కు (Yash)  దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఉత్తరాదిలో సైతం ఈయనకు ఫ్యాన్ క్లబ్స్ ఏర్పడిపోయాయి.
ప్రస్తుతం కేజీఎఫ్ హీరో యశ్‌కు (Yash)  దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఉత్తరాదిలో సైతం ఈయనకు ఫ్యాన్ క్లబ్స్ ఏర్పడిపోయాయి.

కేజీఎఫ్ 2 .. ప్రస్తుతం ఇదే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఈ సినిమా కురిపించిన కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు. ఏప్రిల్ 14న విడుదలైన కేజీఎఫ్ 2 (KGF 2) ఇప్పటికీ బాక్సాఫీసును వేటాడుతూనే ఉంది. కనీవనీ వసూళ్లతో ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. రూ.1000 కోట్ల మార్కు దాటిన నాల్గవ భారతీయ సినిమాగా.. అలాగే ఇదే ఫీట్‌ను నమోదు చేసిన మూడవ సౌత్ సినిమాగా కొత్త రికార్డులను తిరగరాసింది కేజీఎఫ్ 2.

ప్రస్తుతం కేజీఎఫ్ హీరో యశ్‌కు (Yash)  దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఉత్తరాదిలో సైతం ఈయనకు ఫ్యాన్ క్లబ్స్ ఏర్పడిపోయాయి. ఇటీవలే యశ్ అభిమానిగా మారిన ఓ అమ్మాయి, ఆయనపై తనకున్న ప్రేమను వినూత్నంగా తెలిపింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వైరల్ వీడియో అంతర్జాలంలో మంచి వ్యూస్‌ని సొంతం చేసుకుంది. పూజా ప్రకాష్ బస్మే (Pooja Prakash Bhasme)  అనే ఆమె నేలపై కంకర రాళ్లతో, సుద్దముక్కలతో యశ్ చిత్రాన్ని అందంగా గీసింది. 

 

దాదాపు 13.5 అడుగుల ఈ యశ్ చిత్రం ప్రస్తుతం అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. పూజా ఈ చిత్రాన్ని గీసిన తర్వాత డ్రోన్ సహాయంతో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇదే వీడియో ఆమె అధికారిక ఖాతాతో పాటు, వివిధ సోషల్ మీడియా వేదికలపై హల్చల్ చేస్తోంది. నెటిజన్లు కూడా పూజాలో గొప్ప చిత్రకారిణి ఉందని, ఆమె పెయింటింగ్ అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2  (KGF 2) చిత్రం కొత్త రికార్డులను తిరగరాసింది అనడంలో సందేహం లేదు. శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటించగా సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ లాంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. విజయ్ కిరగండూర్ నిర్మాతగా వ్యవహరించారు. 

 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!