ఓటీటీలోకి కీర్తిసురేష్‌ (Keerthy Suresh) ‘చిన్ని’

Updated on Apr 22, 2022 06:44 PM IST
చిన్ని సినిమాలో కీర్తిసురేష్, సెల్వ రాఘవన్
చిన్ని సినిమాలో కీర్తిసురేష్, సెల్వ రాఘవన్

మహానటి సినిమాతో స్టార్‌‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్‌. తెలుగుతోపాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంటోంది. తెలుగులో ప్రస్తుతం సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా ‘సాని కాయిదం’ త్వరలో తెలుగులో ‘చిన్ని’ పేరుతో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్‌ అయ్యేది థియేటర్లలో కాదు. ఓటీటీ వేదికగా ‘చిన్ని’ సినిమాను రిలీజ్‌ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. మే 6వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందని తెలిపింది.

అమెజాన్‌లో ‘చిన్ని’ సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్న నేపథ్యంలో సినిమా తెలుగు ట్రైలర్‌‌ను లాంచ్ చేసింది. ట్రైలర్‌‌ను స్టార్‌‌ హీరో ధనుష్‌ రిలీజ్ చేశారు. ట్రైలర్‌‌లో కీర్తి చెప్పిన డైలాగ్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ‘ప్రతీకారం తీర్చుకోవడమంటే ఏంటి’ అని కీర్తి చెప్పిన డైలాగ్‌ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమా ట్రైలర్‌‌ను చూస్తే కీర్తి సురేష్‌ డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. క్రైమ్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వం వహించగా.. సెల్వ రాఘవన్‌ ప్రధాన పాత్ర పోషించారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!