Sarkaruvari Paata: ఐట‌మ్ సాంగ్ త‌ర‌హాలో 'మ మ మహేషా' అంటూ రెచ్చిపోయిన కీర్తి సురేష్!

Updated on May 08, 2022 09:38 PM IST
కీర్తిసురేష్ మాస్ డ్యాన్స్ (Keerthy Suresh Mass Dance)
కీర్తిసురేష్ మాస్ డ్యాన్స్ (Keerthy Suresh Mass Dance)

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu), కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన స‌ర్కారువారి పాట Sarkaruvari Paata ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలోని  `మ మ మహేషా`  అనే ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఈ పాట‌లో కీర్తి సురేష్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఈ ఊర‌ మాస్‌ సాంగ్‌లో మాస్‌ స్టెప్పులేసింది. దీంతో ఇప్పుడు ఈ సాంగ్ దుమ్ము  లేపుతోంది. అయితే, ఇప్పటి వరకు సంప్రదాయానికి పెద్ద పీట వేసిన కీర్తి సురేష్ తాజాగా ఈ పాట‌లో మాస్‌ స్టెప్పులతో రెచ్చిపోయింది. ఈ సాంగ్ చూస్తే ఐటెమ్‌ సాంగ్‌ హీరోయిన్లు కూడా ఈ రేంజ్‌లో మాస్‌ స్టెప్పులేయరేమో అనిపించేలా రెచ్చిపోయింది కీర్తిసురేష్‌. త‌న కెరీర్ లో తొలిసారి ఆమె పొట్టి దుస్తులు ధరించి సూపర్ స్టార్ తో క‌లిసి మాస్‌ బీట్‌కి స్టెప్పులేసింది. కాగా, ఈ పాటని 'అరబిక్‌ కుత్తు'' ఫేమ్‌ జోనితా గాంధీ, శ్రీ కృష్ణ ఆలపించారు. మ్యూజిక్ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ థమన్‌ సంగీతం అందించారు. ఈ పాట లిరికల్‌ వీడియోని శనివారం సాయంత్రం విడుదల చేశారు. 

అయితే, ఈ పాట‌లో మహేష్‌ (Mahesh Babu), కీర్తిసురేష్ చేసిన డ్యాన్సులు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. థియేటర్‌లో మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ ఫ్యాన్స్ తోపాటు మాస్‌ ఆడియెన్స్ సైతం ఊగిపోతారు. ఈ పాట‌లో కీర్తి సురేష్ అంతగా దుమ్ములేపింది. కాగా, ప్రస్తుతం ఈ పాట అటు యూట్యూబ్ లోనూ సోషల్‌ మీడియాలోనూ వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాట‌లో మొత్తం కీర్తిసురేష్‌ మాస్‌ లుక్‌ గురించే చర్చ జరుగుతుండటం విశేషం. కాగా, మహేష్‌బాబు సైతం పోకిరి సినిమా త‌ర్వాత‌ చాలా రోజులయ్యాక‌ 'సర్కారు వారి పాట'  చిత్రంలో చాలా ఫ్రీగా కనిపించారు. ఈ సినిమాలో ఆయన పాత్ర కూడా అలానే ఉండబోతున్నట్టు ట్రైల‌ర్ చూస్తే తెలుస్తోంది. కాగా, ఇప్పుడు 'మ మ మహేషా' పాట‌లో మ‌హేష్ ఫ్యాన్స్ కి ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చారని చెప్పవ‌చ్చు. 

ఇదిలా ఉంటే.. ఇటీవల 'పుష్ప' (Pushpa) చిత్రంతో రష్మిక మందన్నా కూడా ఇలాంటి ఊరమాస్‌ లుక్ లో కనిపించింది. డ్యాన్సులు సైతం అదే స్థాయిలో చేసి శ్రీవ‌ల్లి గా ఆకట్టుకుంది. ఇప్పుడు `సర్కారు వారి పాట`లో కీర్తిసురేష్‌ కూడా అదేరితీగా కళావతిగా నిలిచిపోతుందని చెప్పవ‌చ్చు. ఇక‌, ఈ పాట‌ చూశాక టాలీవుడ్ లో ఐటెమ్‌ భామలతో అవసరం లేదని.. కీర్తిసురేష్‌ వారిని మించి పోతుందని అంటున్నారు నెటిజన్లు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!