ఎప్పుడూ నా దృష్టి నటనపైనే‌‌ అంటున్న కీర్తి సురేష్ (Keerthy Suresh)

Updated on Apr 24, 2022 07:24 PM IST
నా ఫోకస్ నటనపైనే‌‌ కీర్తి సురేష్ (Keerthy Suresh)
నా ఫోకస్ నటనపైనే‌‌ కీర్తి సురేష్ (Keerthy Suresh)

‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చితక్కువ టైంలోనే  వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్​గా ఎదిగింది కీర్తి సురేష్ (Keerthy Suresh)​.  మహానటి సావిత్రి బయోపిక్​గా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.  అయితే అందరు హీరోయిన్లలా అందాలు ఆరబోసి అవకాశాలు వెతుక్కోవాల్సిన అవసరం తనకు లేదంటూ, నటనకు ఆస్కారమున్న పాత్రల్నే ఎంచుకుంటూ తన రూటే సపరేట్​ అంటూ సాగుతోంది కీర్తి. ​ స్కిన్​షో గురించి చాలా ఇంటర్య్వూలలో ఓపెన్​గానే మాట్లాడిన కీర్తి తాజాగా మరో ఇంటర్వ్యూలో పాత్రల ఎంపికలో తను పాటించే జాగ్రత్తలేంటో చెప్పుకొచ్చింది.

తెలుగుతోపాటు తమిళ్​లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి తాజాగా బాలీవుడ్​లోనూ సినిమా ఓకే చేసిందని ప్రచారం జరుగుతోంది. మహానటితో నటిగా తానేంటో నిరూపించుకున్న కీర్తి కమర్షియల్​ పాత్రలకంటే నటనకు ఆస్కారమున్న పాత్రలనే ఎంచుకుంటూ సక్సెస్​ఫుల్​ హీరోయిన్​గా రాణిస్తోంది​. మిస్​ ఇండియా, గుడ్​లక్​ సఖి వంటి సినిమాలను ఎంచుకుంటూ వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తోంది.

ప్రస్తుతం కీర్తి సురేష్​ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్​గా నటించిన సర్కార్ వారి పాట షూటింగ్​ పూర్తయి త్వరలోనే విడుదల కానుంది.  ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్  సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది ఈ క్రేజీ గాళ్​.

 కాగా, తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కెరియర్ ప్రారంభం నుంచి కూడా తను నటన పైనే దృష్టి పెట్టాననీ, తన అదృష్టం కొద్దీ అలాంటి క్యారెక్ట లే వచ్చాయనీ, ఇప్పటివరకు గ్లామరస్​గా కనిపించే అవసరం రాలేదంటూ చెప్పుకొచ్చింది కీర్తి.  అలాగే తను తెరపై గ్లామరస్ గా కనిపించే విషయంలో కొన్ని పరిమితులు పెట్టుకున్నాననీ, ఎలాంటి పరిస్థితుల్లోను వాటిని అతిక్రమించనంటూ పాత్రల ఎంపికలో తన పరిధులేంటో వివరించింది.

‘మొదటినుంచీ నటనపైనే నా దృష్టి.  పాత్ర ప్రాధాన్యాన్ని బట్టే సినిమాలు ఎంచుకుంటాను. కెరీర్​ ఆరంభం నుంచీ గ్లామరస్ గా కనిపించే పాత్రలకు దూరంగా ఉంటున్నాను. నా ఆలోచన విధానం .. నా నటన నచ్చిన ప్రేక్షకులు నన్ను తప్పకుండా అభిమానిస్తారని భావిస్తున్నా”.. అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్ (Keerthy Suresh)​.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!