మహేష్‌ (MaheshBabu) ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్స్ ఎప్పటి నుంచి అంటే

Updated on Apr 24, 2022 07:11 PM IST
‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్‌బాబు (MaheshBabu)
‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్‌బాబు (MaheshBabu)

సూపర్​ స్టార్​ మహేష్​ బాబు(MaheshBabu ) నటిస్తోన్న సర్కారు​ వారి పాట సినిమా కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఆ నిరీక్షణకి స్వస్తి పలుకుతూ మే 12న సినిమా విడుదల కానుందని ప్రకటించింది చిత్రబృందం.  కాగా ఈ సినిమా ప్రమోషన్స్ మే 1 నుంచి  మొదలుకానున్నాయని సమాచారం. గీతగోవిందం సినిమాతో దర్శకుకడిగా తనలోని ప్రతిభను నిరూపించుకున్న పరుశురామ్ ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో మహేష్​బాబు సరసన కీర్తిసురేష్​ హీరోయిన్​గా నటించింది.  బిజినెస్​మాన్​లో మహేష్​ బాబుతో మాస్​ సెటెప్పులేయించిన థమన్​ ఈ సినిమాకి సంగీతం అందించారు.  ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన కళావతి పాట మిలియన్ల వ్యూస్​తో యూట్యూబ్​లో సెన్సేషన్​ క్రియేట్​ చేస్తోంది.​ కరోనా పాండమిక్​తో రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

​ ప్రస్తుతం సినిమా షూటింగ్​కంటే ప్రమోషన్స్​కే క్రేజ్​ ఎక్కువైంది. వీటి ప్రభావం సినిమా ఫలితంపై కూడా ఎక్కువగానే ఉంటోంది. అందుకే చిన్నపెద్ద తేడాలేకుండా విడుదలకి ముందు నెలరోజుల నుంచే సినిమా విశేషాలను పంచుకుంటూ జనాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు నటీనటులు, దర్శకనిర్మాతలు.   సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఇప్పటికే కొన్ని పాటలను, టీజర్​, ప్రచార చిత్రాలను రిలీజ్​ చేసింది చిత్రబృందం. ఫస్ట్​లుక్​ నుంచి మోషన్​పోస్టర్​, టైటిల్​, టీజర్​, పాటలు.. ఒక్కటేమిటి సినిమా నుంచి ఏ అప్​డేట్​ వచ్చినా గంటల్లో లక్షల వ్యూస్​తో రికార్డులు క్రియేట్ చేస్తూ అభిమానులు ఎంతగా సినిమాకోసం వెయిట్​ చేస్తున్నారో తెలియజేస్తున్నాయి. 

కాగా, మే 1న సర్కారువారి పాట ప్రమోషన్​లను మొదలుపెట్టి సినిమా విడుదలయ్యే వరకు జోరుగా నిర్వహించాలని ప్లాన్​ చేస్తున్నారట. దర్శకుడు పరుశురామ్​ ఈ సినిమాను పోకిరి రేంజ్​లో తెరకెక్కించారనీ, తెలుగు ప్రేక్షకులు సూపర్​స్టార్​ మహేష్ బాబుని మరో కొత్త కోణంలో చూడబోతున్నారనీ ఇప్పటికే జోరుగా  ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి ఊతమిస్తూ ఇప్పటివరకు విడుదలైన టీజర్​, పాటల్లో మహేష్​ లక్​ నిజంగానే స్టైలిష్​గా కనిపించడంతో అంచనాలు మరింత పెరిగాయి.

శ్రీమంతుడు, భరత్​ అను నేను, మహర్షి సినిమాల విజయం తర్వాత మహేష్​ బాబు నటించిన సినిమా అంటే వాటికంటే మంచి కంటెంట్​ ఉంటుందని భావిస్తున్నారు అభిమానులు.  సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్​ బస్టర్​ హిట్​ అందుకున్న సూపర్​స్టార్​ ఈ సినిమాతో ఎలాంటి హిట్​ అందుకోబోతున్నారో తెలియాలంటే మే 20 వరకు వేచిచూడాల్సిందే.

సర్కారువారి పాట రిలీజ్​ అవగానే సూపర్​ స్టార్​  మహేష్ బాబు, దర్శకధీరుడు​ రాజమౌళి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుంది. ఆర్​ఆర్​ఆర్​ ఘన  విజయాన్ని ఆస్వాదిస్తున్న రాజమౌళి త్వరలోనే మహేష్​బాబుతో (MaheshBabu)  చేయబోయే సినిమాని పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!