పరశురాం, థమన్‌లతో కీర్తి సురేష్‌ (Keerthy Suresh) ఫోటో వైరల్

Updated on May 02, 2022 07:30 PM IST
కీర్తి సురేష్ (Keerthy Suresh).  థమన్, పరశురాం
కీర్తి సురేష్ (Keerthy Suresh). థమన్, పరశురాం

‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చితక్కువ టైంలోనే  వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్​గా ఎదిగింది కీర్తి సురేష్ (Keerthy Suresh)​.  మహానటి సావిత్రి బయోపిక్​గా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.  అయితే అందరు హీరోయిన్లలా అందాలు ఆరబోసి అవకాశాలు వెతుక్కోవాల్సిన అవసరం తనకు లేదంటూ, నటనకు ఆస్కారమున్న పాత్రల్నే ఎంచుకుంటూ తన రూటే సపరేట్​ అంటూ సాగుతోంది కీర్తి.   

తెలుగుతోపాటు తమిళ్​లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి తాజాగా బాలీవుడ్​లోనూ సినిమా ఓకే చేసిందని ప్రచారం జరుగుతోంది. మహానటితో నటిగా తానేంటో నిరూపించుకున్న కీర్తి కమర్షియల్​ పాత్రలకంటే నటనకు ఆస్కారమున్న పాత్రలనే ఎంచుకుంటూ సక్సెస్​ఫుల్​ హీరోయిన్​గా రాణిస్తోంది​. మిస్​ ఇండియా, గుడ్​లక్​ సఖి వంటి సినిమాలను ఎంచుకుంటూ వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్​ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్​గా నటించిన సర్కార్ వారి పాట షూటింగ్​ పూర్తయి త్వరలోనే విడుదల కానుంది.  ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్  సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది ఈ క్రేజీ గాళ్​.

సర్కారు వారి పాట సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసుకున్న కీర్తి తాజాగా దర్శకుడు పరశురాం, మ్యూజిక్ డైరెక్టర్‌‌ ఎస్‌ఎస్‌ థమన్‌తో కలిసి ఫోటో తీసుకుంది. ఈ పిక్‌ను కీర్తి తన ఇన్‌స్టా గ్రాం అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. తాజాగా ఈ పిక్‌ వైరల్ అవుతోంది. మహేష్‌బాబు సరసన కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఈనెల 12న రిలీజ్ అవుతోంది. ఇక, తర్వాత నానితో దసరా సినిమా చేస్తున్న కీర్తి, తన సొంత నిర్మాణ సంస్థలో ఒక సినిమా చేయబోతోంది. తమిళంలో సెల్వ రాఘవన్‌తో కలిసి చేసిన క్రైమ్‌ నేపథ్యంలో సాగే సినిమాను తెలుగులో చిన్ని పేరుతో ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో పూర్తి డీ గ్లామర్‌‌ రోల్‌లో నటించింది కీర్తి. కాగా ఇటీవల రిలీజైన చిన్ని ట్రైలర్‌‌  సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!