దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) సీతారామం సినిమా నుంచి ‘కానున్న కల్యాణం’ లిరికల్ వీడియో.. ఆకట్టుకుంటున్న పాట

Updated on Jul 19, 2022 02:27 PM IST
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) సీతారామం సినిమా  పోస్టర్
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) సీతారామం సినిమా పోస్టర్

మ‌ల‌యాళ హీరో దుల్కర్ స‌ల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో న‌టిస్తున్న సినిమా సీతారామ‌మ్ (Sita Ramam). వార్ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడిక్ ల‌వ్‌స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకు హ‌ను రాఘ‌వ‌పూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘కానున్న క‌ల్యాణం’ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. దుల్కర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్ మ‌ధ్య మంచి కెమిస్ట్రీతో సాగిన ఈ పాట సినీ సంగీత ప్రేమికులను ఆక‌ట్టుకుంటోంది.

సీతారామమ్‌ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, క‌న్నడ భామ ర‌ష్మికా మందాన ఫీమేల్ లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్నారు. త‌రుణ్ భాస్కర్, సుమంత్‌, ప్రకాశ్ రాజ్ కీల‌క పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రష్మిక కాశ్మీరి యువతి అఫ్రీన్ క్యారెక్టర్‌‌లో నటిస్తున్నారు. బ్రిగేడియ‌ర్ విష్ణు శ‌ర్మ క్యారెక్టర్‌‌లో సుమంత్ క‌నిపించ‌నున్నారు.

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) సీతారామం సినిమా  పోస్టర్

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఆగ‌స్టు 5వ తేదీన గ్రాండ్‌గా విడుద‌ల కానుంది సీతారామం (Sita Ramam) సినిమా. వైజ‌యంతీ మూవీస్ స‌మ‌ర్పణ‌లో స్వప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై స్వప్న ద‌త్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సినీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.

Read More : యంగ్‌ హీరో దుల్కర్‌‌ సల్మాన్ (Dulquer Salmaan) ‘సీతారామం’ సినిమా రిలీజ్‌ అయ్యేది ఎప్పుడంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!