యంగ్‌ హీరో దుల్కర్‌‌ సల్మాన్ (Dulquer Salmaan) ‘సీతారామం’ సినిమా రిలీజ్‌ అయ్యేది ఎప్పుడంటే?

Updated on May 25, 2022 05:23 PM IST
దుల్కర్ సల్మాన్, మృణాళ్‌ ఠాకూర్
దుల్కర్ సల్మాన్, మృణాళ్‌ ఠాకూర్

యంగ్ టాలెంటెడ్‌ హీరో దుల్కర్‌‌ సల్మాన్ (Dulquer Salmaan) ‘మహానటి’ తర్వాత తెలుగులో నటిస్తున్న డైరెక్ట్ సినిమా ‘సీతారామం’. స్వప్నా సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాలో రష్మికా మందాన కీలక పాత్రో నటిస్తోంది. రామ్ అనే ఓ మిలటరీ లెఫ్టినెంట్.. ఒక అందమైన అమ్మాయితో ప్రేమలో పడితే.. ఎలా ఉంటుంది అనే  కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనే ట్యాగ్ లైన్‌తో మనసుకు హత్తుకునే కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. 

ఇప్పటికే విడుదలైన ‘సీతారామం’ సినిమా టీజర్, సింగిల్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే చిత్రం ట్రైలర్ విడుదల కానుంది. ఆగస్ట్ 5న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా మేకర్స్ ప్రకటించారు. ప్రపంచంలోని ఎత్తైన పోస్టాఫీసులో ‘సీతారామం’ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కథ ప్రకారం యుద్ధానికి సిద్ధమైన హీరో.. హీరోయిన్‌కి రాసిన ప్రేమలేఖల్ని ఈ పోస్టాఫీస్ నుంచే పోస్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలన్నీ ప్రేక్షకుల మరింతగా అలరిస్తాయని దర్శకుడు చెబుతున్నాడు. 

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకే పేరుతో విడుదల కాబోతోంది ‘సీతారామం’. నాలుగు సంవత్సరాల క్రితం శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన ‘పడిపడి లేచే మనసు’ అనే ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాడు హను రాఘవపూడి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. దాంతో మంచి కథ రాసుకొని నాలుగు సంవత్సరాలు ఎంతో కష్టపడి ‘సీతారామం’ సినిమా తీశాడు.

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పెర్ఫామెన్స్, మృణాల్ ఠాకూర్ గ్లామర్, రష్మికా మందాన అభినయం ఈ సినిమాకి హైలైట్స్‌గా నిలుస్తాయని చెబుతున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో తెలియాలంటే విడుదల వరకు వేచిచూడాలి.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!