మేజ‌ర్‌ (Major) చిత్రంలో అమ్మ పాట‌గా సాగిన‌.. 'క‌న్నా క‌న్నా' వీడియో సాంగ్ రిలీజ్ !

Updated on Jun 21, 2022 05:48 PM IST
మేజ‌ర్‌ (Majorలో క‌న్నాక‌న్నా సాంగ్ ఎమోష‌న‌ల్ పాట‌గా సాగింది. మేజ‌ర్‌ను చిన్న‌త‌నంలో త‌న అమ్మ నిద్ర‌పుచ్చేందుకు పాడిన జోల పాటను రామ‌జోగ‌య్య శాస్త్రి గొప్ప‌గా రాశారు.
మేజ‌ర్‌ (Majorలో క‌న్నాక‌న్నా సాంగ్ ఎమోష‌న‌ల్ పాట‌గా సాగింది. మేజ‌ర్‌ను చిన్న‌త‌నంలో త‌న అమ్మ నిద్ర‌పుచ్చేందుకు పాడిన జోల పాటను రామ‌జోగ‌య్య శాస్త్రి గొప్ప‌గా రాశారు.

మేజ‌ర్ (Major) సినిమాకు రోజు రోజుకూ ఆద‌ర‌ణ పెరుగుతోంది. ముంబై దాడుల్లో అమ‌ర వీరుడైన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. హీరో అడివి శేష్ (Adivi Sesh) 'మేజ‌ర్' పాత్ర‌లో మెప్పించారు.

ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్క 'మేజ‌ర్' సినిమాను అద్భుతంగా వెండితెర‌పై  ఆవిష్క‌రించారు. వ‌సూళ్ల ప‌రంగా కూడా 'మేజ‌ర్' సినిమా మంచి క‌లెక్ష‌న్‌ రాబ‌డుతోంది. ప్ర‌స్తుతం 'మేజ‌ర్' చిత్రం నుంచి 'క‌న్నా..క‌న్నా' అంటూ సాగే ఎమోషనల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. 

భావోద్వేగాలతో ముడిపడిన 'క‌న్నా క‌న్నా'
మేజ‌ర్‌లో 'క‌న్నా..  క‌న్నా' అంటూ సాగే పాట ఎన్నో భావోద్వేగాలతో మిళితమై ఉంటుంది. 'మేజ‌ర్' సందీప్‌ను చిన్న‌త‌నంలో త‌న అమ్మ నిద్ర‌పుచ్చేందుకు పాడిన జోల పాటను రామ‌జోగ‌య్య శాస్త్రి గొప్ప‌గా రాశారు. ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా శ్రీ చ‌ర‌ణ్ పాకాల వ్య‌వ‌హ‌రించారు. 'మేజ‌ర్‌'లో శ్రీ చ‌ర‌ణ్ కంపోజ్ చేసిన పాట‌లు ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి.

ముఖ్యంగా 'క‌న్నా.. క‌న్నా' అంటూ సాగే  ఈ భావోద్వేగ గీతం.. అమ్మ పాట‌గా ప్రేక్ష‌కుల‌ హృద‌యాల‌ను బాగా తాకింది. రేవ‌తి మేజ‌ర్ సందీప్ త‌ల్లి పాత్ర‌లో జీవించేశారనే చెప్పాలి. 

''మేజర్' చిత్రంలో అడివి శేష్ (Adivi Sesh) కు జోడీగా సాయి మంజ్రేక‌ర్ నటించింది. ప్ర‌కాష్ రాజ్‌, రేవ‌తి, శోభితా ధూళిపాళ, మురళీ శర్మ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.'మేజ‌ర్' చిత్రాన్ని జీఎంబీ ఎంట‌ర్టైన‌మెంట్స్‌, సోనీ పిక్చ‌ర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ ఎయ‌స్ మూవీస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. 

మేజ‌ర్ ఓ గొప్ప దేశ‌భ‌క్తి చిత్రం
అడివి శేష్ అమెరికాలో పుట్టారు. అక్క‌డే పెరిగారు. ప్ర‌ముఖ తెలుగు ర‌చ‌యిత అడివి బాపిరాజు మ‌నవడే అడివి శేష్. ఆయనపై తన తాత గారి ప్రేరణ ఉంది. విదేశాలలో ఉన్నప్పుడే, సినిమాల‌పై ఇష్టం పెంచుకున్న అడివి శేష్ హీరో అయ్యేందుకు ఇండియా వ‌చ్చారు. శేష్‌కు దేశ‌భ‌క్తి ఎక్క‌వ‌. అందుకే త‌న సినిమా కథలను కూడా అదే ఇతివృత్తంతో ఎంచుకొనేవారు. మేజ‌ర్ (Major) సినిమాతో శేష్ చ‌రిత్ర‌లో నిలిచిపోయే గొప్ప దేశ‌భ‌క్తి చిత్రాన్ని తీశారు. 
 

Read More: మేజ‌ర్ (Major) గురించి ప్ర‌తీ విద్యార్థి తెలుసుకోవాలి.. వీరికి స‌గం ధ‌ర‌కే టికెట్ : అడ‌వి శేష్ (Adivi Sesh)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!