Kaali Poster: అసభ్యంగా 'కాళీ' పోస్టర్ .. దర్శకురాలు లీనా మణిమేకలైను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు !
Kaali Poster: కెనడాలో నివసిస్తోన్న భారతీయ దర్శకురాలు లీనా మణిమేకలై (Leena Manimekalai) పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లీనా 'కాళీ' అనే టైటిల్ ఉన్న డాక్యుమెంటరీ పోస్టర్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఆ పోస్టరులో మహంకాళి అమ్మవారి వేషంలో ఉన్న నటి పొగ తాగుతున్నట్లు కనిపించడం గమనార్హం . ప్రస్తుతం ఈ పోస్టర్‌పై పెద్ద దుమారమే చెలరేగింది.
కాళీ పోస్టర్‌పై అభ్యంతరాలు
లీనా మణిమేకలై 'కాళీ' పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ఆ సినిమాలో అమ్మవారి వేషంలో ఉన్న నటి సిగరెట్ తాగుతూ, చేతిలో ఎల్జీబీటీ జెండాను పట్టుకొని ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను చూసిన హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. భారతదేశ దేవతలను అవమానించేలా లీనా రూపొందించిన డాక్యుమెంటరీ 'కాళీ' పోస్టర్ ఉందంటూ మండిపడుతున్నారు. లీనాను వెంటనే అరెస్ట్ చేయాలంటున్నారు.
లీనాను వెంటనే అరెస్ట్ చేయాలి!
Kaali Poster: హిందూ సంఘాలతో పాటు నెటిజన్లు సైతం కాళీ పోస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీనా భారతీయ దేవతలను అసభ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. లీనాపై ట్విట్టర్‌లో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో #arrestleenamanimekalai అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. హిందూవుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ.. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. లీనా విడుదల చేసిన పోస్టర్‌పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.