కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో స‌త్తా చూపించిన‌ భార‌త డాక్యుమెంట‌రీ (All That Breathes)

Updated on May 29, 2022 08:56 PM IST
ఆల్ ద‌ట్ బ్రీత్స్ అనే భార‌తీయ డాక్యుమెంట‌రీ కేన్స్‌లో అవార్డు ద‌క్కించుకుంది.
ఆల్ ద‌ట్ బ్రీత్స్ అనే భార‌తీయ డాక్యుమెంట‌రీ కేన్స్‌లో అవార్డు ద‌క్కించుకుంది.

All That Breathes: ప్ర‌పంచ సినిమా వేడుక కేన్స్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్‌లో భార‌తీయ డాక్యుమెంట‌రీ స‌త్తా చాటింది. పొల్యూష‌న్‌పై తీసిన డాక్యుమెంట‌రీకి అవార్డు ద‌క్కింది. ఆల్ ద‌ట్ బ్రీత్స్ అనే భార‌తీయ డాక్యుమెంట‌రీ కేన్స్‌లో అవార్డు ద‌క్కించుకుంది. ఈ షార్ట్ ఫిలిమ్ ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ కూడా సొంతం చేసుకుంది.  శౌనక్ సేన్ తీసిన సినిమా ఇండియాకు మ‌రింత పేరు తెచ్చిపెట్టింది. 

విప‌రీత‌మైన కాలుష్యంతో ప‌క్షులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నాయి. ప‌క్షుల‌ను ర‌క్షించేందుకు ఓ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ఏం చేస్తార‌నే క‌థ‌తో ఆల్ ద‌ట్ బ్రీత్స్ (All That Breathes)  షాట్ ఫిలిమ్ తీశారు. భారతదేశం నుంచి  కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అర్హ‌త సాధించిన డాక్యుమెంట‌రీగా ఈ షాట్ ఫిలిమ్ గుర్తింపు తెచ్చుకుంది. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్‌లో అవార్డు పొందిన ఆల్ ద‌ట్ బ్రీత్స్ టీంను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందించారు. అవార్డుకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేశారు. శౌన‌క్ సేన్ ఐడియాను మెచ్చుకున్నారు. శౌనక్ సేన్ ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచాడ‌ని మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసించారు. 

శౌన‌క్ సేన్ ఢిల్లీకి చెందిన వాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది.  కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ప‌క్షులు కూడా కాలుష్యం భారిన ప‌డుతున్నాయి. ఇక గాలి ప‌టాల కార‌ణంగా ప‌క్షులు గాయ‌ప‌డుతున్నాయి. కొన్ని సార్లు గాలి ప‌టాల మాంజా కార‌ణంగా ప‌క్షులు చ‌నిపోతున్నాయి. ప‌క్షుల‌ను కాపాడాల‌నే మెసేజ్‌తో శౌన‌క్ ఆల్ ద‌ట్ బ్రీత్స్  (All That Breathes)  అనే డాక్యూమెంట్రీని తీశాడు. 90 నిమిషాల డాక్యుమెంట్రీని రూపొందించాడు. ఈ షార్ట్ ఫిల్మ్  ఫిలిమ్‌కు కేన్స్ ఫెస్టివ‌ల్‌లో జ్యూరీ అవార్డు వ‌చ్చింది. దీంతో ఆల్ ద‌ట్ బ్రీత్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!