Independence Day 2022 : జయహో భారత్.. కొత్త పద్ధతిలో స్వాతంత్య్ర దినోత్సవ విషెస్ చెప్పిన టాలీవుడ్ తారలు !

Updated on Aug 15, 2022 06:38 PM IST
Independence Day 2022 : టాలీవుడ్‌కు చెందిన ఎందరో తారలు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు
Independence Day 2022 : టాలీవుడ్‌కు చెందిన ఎందరో తారలు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని, సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. "ఒక దేశం.. ఒక గుర్తింపు ! 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం" అంటూ ప్రిన్స్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఓ సందేశాన్ని పోస్టు చేశారు.  

మహేష్ బాబు తన కుమార్తె సితారను కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగం చేశారు. ఆమెతో కలిసి జాతీయ జెండాను ఎగరేస్తూ, ఫోటోలకు ఫోజులిచ్చారు. గతంలో మహేష్ బాబు తాను నటించిన 'బాబీ' చిత్రంలో కూడా దేశభక్తిని పెంపొందించే ఓ పాటలో నటించారు. 'ఈ జెండా పసిబోసి చిరునవ్వురా.. దాస్య సంకెళ్లు తెంచిందిరా" అంటూ సాగే పాటలో ఆయన దేశభక్తి ఔన్నత్యాన్ని చాటారు.

మరో హీరో అల్లు అర్జున్ కూడా తన అభిమానులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. "మన స్వాతంత్య్ర సమరయోధులందరికీ వారు చేసిన త్యాగాలకు గాను అమితమైన గౌరవాన్ని అందిస్తూ.. వందేమాతరం" అంటూ బన్నీ తన సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

అల్లు అర్జున్ గతంలో "నా పేరు సూర్య" అనే ఓ దేశభక్తి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

నటుడు విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని అందించారు "మనమందరం భారతీయులం !!! ఆనందం. గౌరవం. స్వేచ్ఛ. ప్రేమ. బాధ్యత . భారతదేశానికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు " అనే మెసేజ్‌ని పోస్టు చేశారు.

Read More :  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో తారాలోకం .. చిరు, బాలయ్య సోషల్ మీడియా పోస్టులు వైరల్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!