Allu Arjun: అల్లు అర్జున్‌తో ఫైట్ చేయ‌నున్న విజ‌య్ సేతుప‌తి!.. విక్ర‌మ్ ఫార్మూలాతో పుష్ప 2నా?

Updated on Jun 28, 2022 09:15 PM IST
అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ఫ‌2 లో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నార‌ని స‌మాచారం.
అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ఫ‌2 లో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నార‌ని స‌మాచారం.

అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ఫ ఓ రేంజ్‌లో హిట్ సాధించింది. ద‌ర్శ‌కుడు సుకుమార్ పుష్ఫ‌2 కోసం భారీ ప్లానింగే చేస్తున్నారు. విక్ర‌మ్‌లో విలన్ పాత్ర‌తో మ‌రింత‌ గుర్తింపు తెచ్చుకున్న విజ‌య్ సేతుప‌తి కూడా పుష్ఫ 2లో న‌టిస్తార‌ట‌. పుష్ఫ 2 సినిమాలో విజ‌య్ సేతుప‌తి ఏ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తురో తెలిస్తే షాక్ అవాల్సిందే. విక్ర‌మ్ సినిమాలో ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ఐడియానే సుకుమార్ కూడా ఫాలో అవుతున్నారా అనిపిస్తుంది. 

లోకేష్ బాట‌లో సుకుమార్
పుష్ఫ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప - ది రూల్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతుంది. పుష్ఫ చిత్రం నార్త్‌లో కూడా భారీ విజ‌యాన్ని అందుకుంది. కేజీఎఫ్, ఆర్.ఆర్.ఆర్. వంటి సినిమాలు ఇండియ‌న్ సినిమా రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాయి. ఇక క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన విక్ర‌మ్ కూడా కాసుల సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమాల రికార్డుల‌ను చూసిన ద‌ర్శ‌కుడు సుకుమార్ పుష్ఫ 2ను బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌తో రికార్డులు తిర‌గ‌రాసేలా నిర్మించాల‌నుకుంటున్నారు. 

పుష్ఫ చిత్రంలో అల్లు అర్జున్, ఫహద్‌ ఫాజిల్ మ‌ధ్య సీన్స్ థియేట‌ర్‌ను ద‌ద్ద‌రిల్లించాయి. అలాగే విజ‌య్ సేతుప‌తిని పుష్ఫ 2 కోసం రంగంలోకి దించ‌నున్నారు సుకుమార్. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నార‌ని స‌మాచారం. అల్లు అర్జున్ (Allu Arjun), విజ‌య్ సేతుపతి మ‌ధ్య ప‌వ‌ర్ ఫుల్ డైలాగులతో పాటు మాస్ యాక్ష‌న్ సీన్స్ కూడా తెర‌కెక్క‌నున్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య ఉండే సీన్స్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయ‌ట‌. 

అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ఫ‌2 లో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నార‌ని స‌మాచారం.

పుష్ప 2లో సుకుమార్ స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేశారా?
అల్లు అర్జున్ (Allu Arjun)తో పాటు ఫహద్‌, విజయ్‌ సేతుపతి ముగ్గురు చేసే యాక్ష‌న్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత వినోదం అందించ‌నుంది. సుకుమార్ పుష్ఫ‌2 కోసం ఇంకా ఎవ‌రెవ‌రిని తెర‌పై చూపిస్తారోన‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఎక్కువ మంది స్టార్స్‌తో పుష్ఫ‌2కు హైప్ క్రియేట్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా శ్రీవ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక మంద‌నే న‌టిస్తున్నార‌ట‌. ర‌ష్మిక మంద‌న క్యారెక్ట‌ర్ పుష్ఫ 2లో చ‌నిపోతుంద‌నే టాక్ వినిపిస్తుంది. సునీల్, అనసూయ, ధనుంజయ పాత్రలకు ప్రాధాన్యత ఉండేలా సుకుమార్ ప్లాన్ చేశార‌ట‌.

అనుకున్న తేదీకి రిలీజ్ కాలేదా!
పుష్ఫ 2 చిత్రం రిలీజ్ చాలా ఆల‌స్యం కానుంద‌ని అంటున్నారు. 2023 ద‌స‌రాకు ఈ సినిమాను రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ ఈ సినిమా అనుకున్న‌ట్లు తెర‌కెక్కించ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. 
విదేశాల్లో కూడా కొన్ని సీన్స్ చిత్రీక‌రించ‌నున్నారు. ఇప్ప‌టికే సుకుమార్ విదేశాల్లో జ‌రిగే షూటింగ్ షెడ్యూల్ కోసం సిద్ధ‌మ‌య్యార‌ట. పుష్ప 2 సినిమా కోసం రూ. 400 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. అక్టోబర్ నుంచి అల్లు అర్జున్ (Allu Arjun) కొత్త సినిమా పుష్ప - ది రూల్‌ షూటింగ్‌ స్టార్ట్ కానుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!