ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun)..సైమా (SIIMA)లో తగ్గేదేలే.. ‘పుష్ప’కు ఆరు అవార్డులు

Updated on Sep 11, 2022 08:20 PM IST
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కనున్న పుష్ప2 సినిమా షూటింగ్ ఈ నెల మూడవ వారంలో ప్రారంభంకానుంది
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కనున్న పుష్ప2 సినిమా షూటింగ్ ఈ నెల మూడవ వారంలో ప్రారంభంకానుంది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప సినిమా సూపర్‌‌హిట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు బన్నీ. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్ గెటప్, యాటిట్యూడ్, డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే కొనసాగుతున్నాయి. రష్మికా మందాన హీరోయిన్‌గా నటించిన పుష్ప సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో కూడా దుమ్మురేపుతోంది. ఇక, ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు సుకుమార్, బన్నీ రెడీ అయ్యారు.

బెంగళూరులో ఆదివారం జరిగిన సైమా (SIIMA) అవార్డ్స్ వేడుకలో పుష్ప స్టార్స్ సందడి చేశారు. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నారు. మరో ఐదు కేటగిరిల్లో కూడా పుష్ప సినిమాకు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడు కేటగిరీ కాకుండా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సాహిత్య రచయిత కేటగిరీల్లో కూడా పుష్ప సినిమాకు అవార్డులు వచ్చాయి.  

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కనున్న పుష్ప2 సినిమా షూటింగ్ ఈ నెల మూడవ వారంలో ప్రారంభంకానుంది

మరో అయిదు కేటగిరీల్లో..

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సాహిత్య రచయిత ఇలా మొత్తం ఆరు కేటగిరీల్లో పుష్ప సినిమా అవార్డులు దక్కించుకుంది. పాన్ ఇండియా సినిమాగా పోయినేడాది డిసెంబర్ 17వ తేదీన విడుదలైన పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లనే సాధించింది. ఈ సినిమా నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. పుష్ప సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు బన్నీ. ఈ సందర్భంగా సైమా (SIIMA)కు అల్లు అర్జున్‌ (Allu Arjun) ధన్యవాదాలు తెలిపారు. పుష్ప సినిమా సక్సెస్‌ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు సుకుమార్. త్వరలోనే పుష్ప2 సినిమా షూటింగ్ సెట్స్‌పైకి వెళ్లనుంది. సెప్టెంబర్‌‌ మూడోవారంలో పుష్ప2 సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

Read More : పుష్ప2 తర్వాత అల్లు అర్జున్‌(Allu Arjun)తో సినిమా చేయాలని త్రివిక్రమ్(Trivikram Srinivas) ప్లాన్ చేస్తున్నారా?

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కనున్న పుష్ప2 సినిమా షూటింగ్ ఈ నెల మూడవ వారంలో ప్రారంభంకానుంది

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కనున్న పుష్ప2 సినిమా షూటింగ్ ఈ నెల మూడవ వారంలో ప్రారంభంకానుంది

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!