అంగరంగ వైభవంగా హీరోయిన్ హన్సిక మోత్వానీ (Hansika Motwani) పెళ్లి వేడుక.. ఫొటోలు, వీడియోలు వైరల్!

Updated on Dec 05, 2022 02:10 PM IST
గత వారం నుంచే హన్సిక (Hansika Marriage) పెళ్లి సందడి మొదలైంది. ఇక, శుక్రవారం సూఫీ నైట్‌ వేడుకను ఘనంగా జరిపారు.
గత వారం నుంచే హన్సిక (Hansika Marriage) పెళ్లి సందడి మొదలైంది. ఇక, శుక్రవారం సూఫీ నైట్‌ వేడుకను ఘనంగా జరిపారు.

ప్రముఖ సినీ నటి హన్సిక మోత్వానీ (Hansika Motwani) వివాహం ఘనంగా జరిగింది. తన ప్రియుడు, వ్యాపార భాగస్వామి సోహైల్ తో ఆమె ఏడడగులు వేశారు. ఆదివారం నాడు (డిసెంబర్ 4న) కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. జైపూర్‌ సమీపంలోని ముందోటా ఫోర్ట్‌ ప్యాలెస్‌ లో జరిగిన ఈ పెళ్లికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 

హన్సిక, సోహైల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. హన్సిక తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ తర్వాత బాణాసంచా వెలుగుల్లో పెళ్లి వేదికపైకి ఎంట్రీ ఇచ్చింది. రాజసం ఉట్టిపడేలా నడుచుకుంటూ వస్తున్న హన్సిక వీడియో ఆకట్టుకుంటోంది. హన్సిక, సోహెల్ సింధీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట చేతిలో చెయ్యి వేసుకుని నడుస్తూ కనువిందు చేశారు.

గత వారం నుంచే హన్సిక (Hansika Marriage) పెళ్లి సందడి మొదలైంది. ఇక, శుక్రవారం సూఫీ నైట్‌ వేడుకను ఘనంగా జరిపారు. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా వధూవరులు పలు పాటలకు డ్యాన్సులు చేసి సందడి చేశారు. 3న మెహందీ, సంగీత్‌ నిర్వహించారు. హన్సిక సంగీత్‌ లో గులాబీ రంగు లెహంగా ధరించి అందంగా కనిపించింది. అయితే సోహెల్ తన నలుపు రంగు షేర్వాణీ ధరించాడు. 4న ఉదయం హల్దీ వేడుక నిర్వహించారు. సాయంత్రం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యింది. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

తన పెళ్లి వేడుకలో హన్సిక (Hansika Wedding Outfit) అందమైన సాంప్రదాయ ఎరుపు రంగు లెహంగా, ఆకర్షణీయమైన ఆభరణాలు ధరించింది. మరోవైపు వరుడు సోహెల్ పూర్తిగా ఐవరీ షేర్వానీ లుక్‌లో అందంగా కనిపించాడు. ఇక, ప్రీ వెడ్డింగ్ పార్టీ కోసం, వధువు, వరుడు తెల్లటి దుస్తులు ధరించి కనువిందు చేశారు. 

‘దేశముదురు’ సినిమాతో హన్సిక కథానాయికగా వెండితెరపై మెరిశారు. ఆ తర్వాత ఆమెకు తెలుగు, తమిళంలో అవకాశాలు వరుస కట్టాయి. ఇటీవల ఆమె నటించిన 50వ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే సోహైల్ తో తన వివాహం గురించి బయటపెట్టారు. సోహైల్ కు అంతకు ముందే వివాహమైంది. గతంలో హన్సిక స్నేహితురాలితో ఆయనకు పెళ్లి కాగా.. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత హన్సిక, సొహైల్ మధ్య ప్రేమాయణం మొదలయింది.  

 

హన్సిక (Hansika Motwani) ప్రస్తుత సినిమాల గురించి ప్రస్తావిస్తే.. బాలనటిగా కెరీర్‌ మొదలు పెట్టింది. తక్కువ కాలంలోనే తన అందం, అభినయంతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. నార్త్ తో పాటు సౌత్ లోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హన్సిక ‘పార్ట్‌ నర్‌’, ‘105 మినిట్స్‌’ సినిమాలతో పాటు తెలుగులో ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో నాలుగు సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!