మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో చాన్స్ కొట్టేసిన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)! డీజే టిల్లు సీక్వెల్‌లో..

Updated on Aug 13, 2022 07:32 PM IST
సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి నటించిన సూపర్ హిట్ సినిమా డీజే టిల్లు సీక్వెల్‌లో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)
సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి నటించిన సూపర్ హిట్ సినిమా డీజే టిల్లు సీక్వెల్‌లో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)

‘రౌడీ బాయ్స్‌’ సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్‌ సరసన రెండు సినిమాల్లో నటిస్తున్న అనుపమ.. అ..ఆ, ప్రేమమ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నిఖిల్‌తో కలిసి నటించిన కార్తికేయ2 సినిమా ఇటీవల రిలీజై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది.

ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్‌‌ మధ్యలో కొంత బ్రేక్ వచ్చినా.. ప్రస్తుతం మంచి ఆఫర్లను పట్టేస్తూ దూసుకుపోతున్నారు ఈ మలయాళీ బ్యూటీ.

సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి నటించిన సూపర్ హిట్ సినిమా డీజే టిల్లు సీక్వెల్‌లో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)

చిన్న సినిమాగా రిలీజై..

చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్‌గా నిలిచింది డీజే టిల్లు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన డీజే టిల్లు సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడమే కాకుండా యూత్‌లో మంచి క్రేజ్‌ ఉన్న సినిమా అయ్యింది. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్.

అయితే ఆ సీక్వెల్‌లో కూడా సిద్ధు సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తారని అందరూ అనుకున్నారు. అయితే దీనిపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రేజీ సీక్వెల్‌లో నేహా శెట్టి స్థానంలో అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran)ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

Read More : పవన్‌ కల్యాణ్‌ అంటే చాలా ఇష్టం.. భీమ్లానాయక్ సినిమా థియేటర్‌‌లో చూశా : అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!