రిలేషన్‌షిప్ స్టేటస్‌పై అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) సంచలన కామెంట్లు

Updated on May 30, 2022 08:32 PM IST
అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran)
అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran)

‘ప్రేమమ్‌’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది మలయాళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran). కొన్ని సినిమాలే చేసినా తక్కువ సమయంలోనే మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ఎక్కువ సమయం సోషల్‌ మీడియాలో గడిపే అనుపమ తరచూ తన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంది. ఇటీవల రౌడీబాయ్స్ మూవీతో సందడి చేసిన అనుపమ ప్రస్తుతం కార్తికేయ 2, 18 పేజెస్‌, బటర్‌ ఫ్లై సినిమాల్లో నటిస్తోంది. 

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్ స్టేటస్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది అనుపమ. ఆ విషయాలు ఆమె మాటల్లోనే.. 'నాకు లవ్‌ మ్యారేజ్‌పై మంచి అభిప్రాయమే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలను చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది. ప్రేమ వివాహమే చేసుకోవాలని ఉంది. మా పేరెంట్స్‌కి కూడా ఈ విషయం తెలుసు. పెళ్లంటూ చేసుకుంటే లవ్‌ మ్యారేజ్‌ మాత్రమే చేసుకుంటా. నేను సింగిల్‌.. కాదు మింగిల్‌.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నా రిలేషన్‌షిప్ స్టేటస్ నాకు కూడా సరిగ్గా తెలియట్లేదు. నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి అవతలి సైడ్‌ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. ప్రస్తుతం వన్‌ సైడ్‌ లవ్‌ అని మాత్రమే చెప్పగలను' అంటూ సంచలన విషయాలు చెప్పింది అనుపమా పరమేశ్వరన్‌. 

అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran)

అనుపమ పరమేశ్వరన్‌ న‌టించిన చిత్రం రౌడీ బాయ్స్‌. ఈ మూవీలో కొత్త హీరోతో లిప్‌లాక్ సీన్లలో న‌టించి రెచ్చిపోయిందీ మలయాళీ బ్యూటీ. ఇప్పటివ‌ర‌కు డీసెంట్‌గా ఉండే క్యారెక్టర్లే చేసిన అనుపమ .. త‌న‌లోని కొత్త కోణాన్ని బ‌య‌ట‌కు తీస్తూ రొమాన్స్‌ల‌తో కుర్రకారుకి మతిపోగొట్టింది రౌడీ బాయ్స్ సినిమాతో. ఇది చూసి అభిమానులు సైతం షాక్ అయ్యారు! అనుపమ ఈ రేంజ్‌లో హ‌ద్దులు దాటి న‌టించ‌డానికి ఆమెకు ఆఫ‌ర్ చేసిన‌ రెమ్యున‌రేష‌న్ కూడా ఓ కార‌ణం అని ఇండస్ట్రీ టాక్.

రౌడీ బాయ్స్ సినిమాకు అనుప‌మ‌ (Anupama Parameswaran) రూ.50 ల‌క్షల పారితోషికం ఇచ్చారట. ఇప్పటివ‌ర‌కు రూ.25 ల‌క్షల లోపు రెమ్యున‌రేష‌న్ అందుకునే అనుప‌మకు ఇది కెరీర్‌లో హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ అని తెలుస్తోంది. ఆశిష్ రెడ్డి హీరోగా ప‌రిచ‌య‌మైన రౌడీ బాయ్స్ చిత్రానికి హ‌ర్ష కొనుగొంటి ద‌ర్శక‌త్వం వ‌హించాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!