శర్వానంద్‌ (Sharwanand) ‘ఒకే ఒక జీవితం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడంటే.. డేట్‌ కన్ఫమ్ చేసిన మేకర్స్!

Updated on Sep 06, 2022 08:55 PM IST
ఆడాళ్లూ మీకు జోహార్లు సినిమా తర్వాత హీరో శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన సినిమా ఒకే ఒక జీవితం
ఆడాళ్లూ మీకు జోహార్లు సినిమా తర్వాత హీరో శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన సినిమా ఒకే ఒక జీవితం

డిఫరెంట్ కథలను సెలక్ట్‌ చేసుకుంటూ సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేస్తుంటారు హీరో శర్వానంద్ (Sharwanand). పోయినేడాది ‘శ్రీకారం’, ‘మ‌హాస‌ముద్రం’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గర బోల్తాపడ్డాయి. ఇక, ఈ ఏడాది భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ‘ఆడాళ్లూ మీక జోహార్లు’ రిజల్ట్‌ కూడా శ‌ర్వానంద్‌ను నిరాశ‌ప‌రిచింది.

ప్రస్తుతం శర్వానంద్ ఒక హిట్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ‘ఒకే ఒక‌ జీవితం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ప్రచార చిత్రాలు, ట్రైల‌ర్‌ సినిమాపై భారీ అంచ‌నాలలను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం మేక‌ర్స్ ప్రమోష‌న్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా మేక‌ర్స్‌ ఒకే ఒక జీవితం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ ప్రక‌టించారు.

ఆడాళ్లూ మీకు జోహార్లు సినిమా తర్వాత హీరో శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన సినిమా ఒకే ఒక జీవితం

జేఆర్సీ కన్వెన్షన్‌లో..

‘ఒకే ఒక జీవితం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లోని జేఆర్సీ క‌న్వెన్షన్‌లో బుధ‌వారం సాయంత్రం 6 గంట‌ల నుంచి నిర్వహించనున్నట్టు ప్రక‌టించారు. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల కీల‌క‌పాత్ర పోషించారు. ఒకే ఒక జీవితం సినిమా ప్రమోష‌న్లలో భాగంగా శ‌ర్వానంద్, అఖిల్‌తో క‌లిసి అమ్మ చేతి వంటి అని ఒక వీడియో చేశారు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌ అవుతోంది.

శ్రీకార్తిక్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్‌కు జోడీగా రీతూ వ‌ర్మ న‌టించారు. డ్రీమ్ వారియ‌ర్స్ పిక్చర్స్ ప‌తాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళంలోనూ తెరకెక్కిన శర్వానంద్‌ (Sharwanand) ‘ఒకే ఒక జీవితం’ సినిమా సెప్టెంబర్‌‌ 9వ తేదీన విడుదల కానుంది.

Read More : సెప్టెంబర్‌‌లో సందడి చేయనున్న వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej), శర్వానంద్ (Sharwanand), మణిరత్నం సినిమాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!