హీరోగా నటసింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna) కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

Updated on Sep 06, 2022 09:32 PM IST
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టే. రాహుల్​ సాంకృత్యన్​ దర్శకత్వంలో నటించబోతున్న మోక్షజ్ఞ.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టే. రాహుల్​ సాంకృత్యన్​ దర్శకత్వంలో నటించబోతున్న మోక్షజ్ఞ.

ఏ రంగంలోనైనా వారసులదే హవా. ముఖ్యంగా సినీరంగంలో స్టార్​ హీరోలుగా ఎదిగిన వారి పిల్లలు కూడా వారి నటవారసులుగా వెండితెరపై సందడి చేస్తుంటారు. తెలుగు పరిశ్రమలో కొన్ని దశాబ్దాలుగా ఎదురులేకుండా రాణిస్తున్నది నందమూరి కుటుంబం.

ఎన్టీఆర్​ నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుని హరికృష్ణ, బాలకృష్ణ(Balakrishna) పరిశ్రమలో అడుగుపెట్టారు. వందకు పైగా చిత్రాలతో నందమూరి నటసింహంగా అందరినీ అలరిస్తున్నారు బాలయ్య.

తాత, తండ్రి, బాబాయ్​ వారసత్వాన్ని నిలబెడుతూ టాలీవుడ్​ని ఏలుతున్నారు యంగ్​టైగర్​ ఎన్టీఆర్​. హీరోగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు నందమూరి కల్యాణ్​ రామ్​.  అయితే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తారా, రారా అనే విషయంపై చాలారోజులుగా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 

 

హీరోగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టే. రాహుల్​ సాంకృత్యన్​ దర్శకత్వంలో నటించబోతున్న మోక్షజ్ఞ.

ప్రస్తుతం పరిశ్రమలో బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కొనసాగుతున్నా.. అభిమానులు మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా రాబోతున్నాడు అని చాలాకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మోక్షజ్ఞను డైరెక్ట్ చేయబోయే దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఆ వార్తలన్నీ అవాస్తవాలు కాగా.. ఇప్పుడు మాత్రం మోక్షజ్ఞ యొక్క ఎంట్రీ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

రాహుల్ ​ దర్శకత్వంలో..

మోక్షజ్ఞ మొదటి సినిమాను శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యనన్ డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కథ మొత్తం ప్రేమ చుట్టూ తిరగనుంది అని సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమాకు ‘ప్రేమించి చూడు’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే బాలకృష్ణ(Balakrishna) వారసుడి ఎంట్రీ విషయాన్ని అధికారికంగా ప్రకటించేవరకు వేచిచూడక తప్పదు. 

Read More: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘ఎన్‌బీకే 108’ రిలీజ్ చేసేది ఎప్పుడో చెప్పేస్తున్న మేకర్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!