నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘ఎన్‌బీకే 108’ రిలీజ్ చేసేది ఎప్పుడో చెప్పేస్తున్న మేకర్స్

Updated on Aug 19, 2022 11:49 PM IST
బాలకృష్ణ (BalaKrishna) , అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాను వచ్చే వేసవికి రిలీజ్ చేయనున్నారని టాక్
బాలకృష్ణ (BalaKrishna) , అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాను వచ్చే వేసవికి రిలీజ్ చేయనున్నారని టాక్

టాలీవుడ్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేనితో ఎన్‌బీకే 107 వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ ప్రాజెక్టు వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఇప్పటికే అప్‌డేట్ వ‌చ్చింది చిత్ర యూనిట్.

ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. బాల‌కృష్ణ అభిమానుల‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండ‌బోతున్నాయ‌ని వీడియోతో స్పష్టమ‌వుతోంది.

బాలకృష్ణ (BalaKrishna) , అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాను వచ్చే వేసవికి రిలీజ్ చేయనున్నారని టాక్

వేసవిలో రిలీజ్‌కు..

ఇదిలా ఉంటే బాలకృష్ణ సినిమాకు సంబంధించిన మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్‌లో హల్‌చల్‌ చేస్తోంది. డైరెక్టర్‌ అనిల్ రావిపూడితో బాలకృష్ణ చేయ‌బోతున్న ఎన్‌బీకే108 ప్రాజెక్టు రిలీజ్ టాపిక్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఈ సినిమాను వ‌చ్చే స‌మ్మర్ సీజ‌న్‌లో విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట నిర్మాత‌లు. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా 2023 ఏప్రిల్‌లో విడుదల కానుంది. మ‌రి దీనిపై బాల‌కృష్ణ – -అనిల్ రావిపూడి టీం స్పందిస్తుందేమో చూడాలి.

ఇప్పటికీ సెట్స్ పైకి వెళ్లని ఈ సినిమాను ఇంత త‌క్కువ టైంలో పూర్తి చేసి..  ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకువ‌స్తార‌నేది ప్రస్తుతానికి స‌స్పెన్స్. బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటిస్తున్న ఎన్‌బీకే 108 సినిమాలో పెళ్లి సందD ఫేం శ్రీలీల.. బాల‌కృష్ణ కూతురిగా క‌నిపించ‌బోతున్నట్టు టాక్‌. కామెడీ ట‌చ్‌తో సాగే యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కనున్న ఈ ప్రాజెక్టును సాహు గార‌పాటి నిర్మించ‌నున్నారు.

Read More : NBK 108: 'ఎన్‌బీకే 108' అప్‌డేట్స్ రిలీజ్ చేస్తున్నార‌ట‌!.. పండుగ అంటున్న బాల‌కృష్ణ (Balakrishna) ఫ్యాన్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!