మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) 'ధమాకా' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే?

Updated on Aug 16, 2022 09:22 PM IST
మాస్ మహారాజా రవితేజ (RaviTeja), శ్రీలీల జంటగా నటించిన ధమాకా సినిమా నుంచి మాస్‌ సాంగ్
మాస్ మహారాజా రవితేజ (RaviTeja), శ్రీలీల జంటగా నటించిన ధమాకా సినిమా నుంచి మాస్‌ సాంగ్

 మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను ఓకే చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు రిలీజ్ చేశారు. అయితే ఈ రెండు సినిమాల ఫలితాలు అనుకున్నంత పాజిటివ్‌గా రాలేదు. దీంతో రవితేజ అభిమానులు తీవ్రంగా నిరాశచెందారు.

ఈ రెండు సినిమాల ఫలితాలు రవితేజను కూడా పూర్తిగా నిరాశపరిచాయి. దాంతో రవితేజ తన తర్వాతి సినిమాలపై పూర్తిగా శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం రవితేజ మూడు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. వాటిలో ‘ధమాకా’ ఒకటి.

మాస్ మహారాజా రవితేజ (RaviTeja), శ్రీలీల జంటగా నటించిన ధమాకా సినిమా నుంచి మాస్‌ సాంగ్

పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో..

‘నేనులోకల్’ ఫేం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ధమాకా సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ధమాకా సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు మేకర్స్.

ఈ సినిమాలోని ‘జింతాక్’ అంటూ సాగే మాస్ బీట్ సాంగ్‌ను ఆగస్టు 18వ తేదీ మధ్యాహ్నం 12.01 గంటలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజపై శ్రీలీల కూర్చొని స్టెప్స్‌ వేస్తున్నట్టుగా పోస్టర్‌‌లో ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ ధమాకా సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ‘క్రాక్‌’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన రవితేజ (Ravi Teja)కు ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ఫలితాలు నిరాశనే మిగిల్చాయి.  

Read More : Raviteja & Sriwas: వరుసగా సినిమాలు చేస్తున్న మాస్ మహారాజ్.. శ్రీవాస్ దర్శకత్వంలో రవితేజ!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!