బాలకృష్ణ (Balakrishna) – అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా ప్రియమణి!

Updated on May 26, 2022 07:23 PM IST
బాలకృష్ణ, ప్రియమణి, అనిల్‌ రావిపూడి
బాలకృష్ణ, ప్రియమణి, అనిల్‌ రావిపూడి

‘అఖండ‌’ సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకున్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna). బోయ‌పాటి శ్రీను ద‌ర్శక‌త్వంలో వచ్చిన ఈ సినిమా బాల‌య్య అభిమానుల‌తోపాటు సినీ ప్రేమికులనూ అలరించింది. ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ మ‌లినేని ద‌ర్శక‌త్వంలో పొలిటిక‌ల్ మాస్ సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి ‘అన్నగారు’ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా త‌ర్వాత అనిల్‌ రావిపూడితో సినిమా చేయ‌నున్నాడు బాల‌య్య, ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది.

ఎఫ్‌3 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే బాలయ్యతో తీయబోయే సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు దర్శకుడు అనిల్. ఈ చిత్రంలో బాల‌య్య 45 సంవత్సరాల వయస్సు ఉన్న తండ్రి క్యారెక్టర్‌‌ చేస్తున్నట్టు చెప్పాడు. ఈ సినిమా తండ్రి, కూతురు ఎమోష‌న్‌తో సాగుతుందని తెలిపాడు. బాల‌య్య కూతురుగా ‘పెళ్ళిసంద‌D’ హీరోయిన్‌ శ్రీలీల నటించనుంది. కాగా, ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా మెహ‌రీన్‌ను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. మెహరీన్‌ను ఎంపిక చేసినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.

 

మిత్రుడు సినిమాలో బాలకృష్ణ, ప్రియమణి

అయితే ఈ సినిమా గురించి మరో అప్‌డేట్‌ వచ్చినట్టు తెలుస్తోంది. బాలయ్య పక్కన ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియమణి నటించనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అయితే దీనిపైన కూడా ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చిత్ర యూనిట్‌ నుంచి రాలేదు. అయితే ప్రియమణిని బాలయ్య(Balakrishna) పక్కన హీరోయిన్‌గా దాదాపు ఖరారు చేశారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. వెంకటేష్‌ హీరోగా వచ్చిన ‘నార‌ప్ప’లో సంద‌ర‌మ్మగా ప్రియమణి నటనకు ఫిదా అయిన అనిల్‌ బాలయ్య పక్కన హీరోయిన్‌గా ప్రియమణిని ఎంపిక చేయాలని అనుకుంటున్నాడని టాక్. కాగా, బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా ప్రియమణి మిత్రుడు సినిమా చేసింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!