మరో బంపర్‌‌ ఆఫర్ కొట్టేసిన ‘పెళ్లిసందD’ హీరోయిన్‌ శ్రీలీల.. అనిల్‌ రావిపూడి సినిమాలో ఏకంగా బాలకృష్ణ (BalaKrishna) కూతురిగా

Updated on May 24, 2022 10:33 AM IST
శ్రీలీల, బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి
శ్రీలీల, బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి

'అఖండ' మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ (BalaKrishna). బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన అఖండ సినిమా బాలయ్య సూపర్ హిట్ చిత్రాల్లో  ఒకటిగా నిలిచింది. అదే జోష్‌లో బాలకృష్ణ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సెట్స్‌పై ఉండగానే.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ మూవీ చేయనున్నట్టు ప్రకటించాడు బాలయ్య.

ప్రస్తుతం అనిల్ రావిపూడి -బాలయ్య కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. 'పెళ్లిసందD' మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన యంగ్ హీరోయిన్ శ్రీలీల.. అనిల్ మూవీలో బాలకృష్ణ కూతురుగా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. 'పెళ్లిసందD' సినిమాతో బ్యూటిఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీలీల.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ 'ధమాకా' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలో బాలయ్య మూవీలో కూడా ఆమె ఛాన్స్ కొట్టేసినట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్.

బాలకృష్ణతో తాను చేయబోయే మూవీ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని అనిల్ రావిపూడి ఇప్పటికే చెప్పాడు. బాలకృష్ణను భిన్నమైన రోల్‌లో చూపిస్తానని వెల్లడించాడీ యంగ్ డైరెక్టర్. తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన కథాంశంతో అనిల్ రావిపూడి సినిమా ప్లాన్ చేశాడని.. అందుకే బాలయ్య కూతురిగా శ్రీలీలను సెలెక్ట్‌ చేశాడని తెలుస్తోంది. ఈ సినిమా వెండితెరపై సరికొత్తగా ఉంటుందని అనిల్ చెప్తున్నాడు. ప్రస్తుతం ఎఫ్3 మూవీ ప్రమోషన్స్‌లో బిజీ ఉన్న అనిల్‌.. ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత బాలయ్య (BalaKrishna) మూవీని పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!