బిగ్ బాస్ (Boggboss Nonstp) స్టేజీ మీదే హోస్ట్ నాగార్జున‌కు ముద్దుపెట్టిన అషూరెడ్డి!

Updated on May 11, 2022 09:35 AM IST
అషూరెడ్డి, నాగార్జున‌ (Ashu Reddy, Nagarjuna)
అషూరెడ్డి, నాగార్జున‌ (Ashu Reddy, Nagarjuna)

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీ ద్వారా తెలుగు లో ప్రసారమ‌వుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో (Boggboss Nonstp) ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకుంది. ఈ షో చూస్తుండగానే ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ షో విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి అషు రెడ్డి ఎలిమినేట్ అయింది. బాబా భాస్కర్ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను అరియానా, అషు లలో ఇద్దరిలో ఎవరికి వాడకూడ‌ద‌ని నిశ్చయించుకున్నాడు. దీంతో అషు రెడ్డి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. అలాగా నవ్వుతూ స్టేజి పైకి కూడా వచ్చేసింది అషు రెడ్డి. ఇక‌, స్టేజిపైకి వ‌చ్చాక‌ తాను ఎలిమినేట్ అయినందుకు ఎలాంటి బాధ లేదని తాను ఎంతో సంతోషంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చానని హోస్ట్ నాగార్జునతో చెప్పుకొచ్చింది. ఒక‌వేళ ఎలిమినేట్ కాకపోయి ఉంటే.. మరొక వారం ఉండి ఉంటే త‌ప్ప‌కుండా టాప్ 6 లోకి వచ్చే దాన్నని తెలిపింది.

అనంతరం బిగ్ బాస్ అషు రెడ్డి (Ashu Reddy) జర్నీ వీడియో రూపంలో చూపించారు. అందులో అషు రెడ్డి హోస్ట్ నాగార్జునకు బుగ్గ మీద ముద్దు పెట్టింది. దానికి సంబంధించిన సీన్ ను అషు రెడ్డి జర్నీ వీడియోలో నిర్వాహ‌కులు చూపించారు. ఆ వీడియో చూసిన తర్వాత అషు రెడ్డి వెళ్తూ వెళ్తూ మళ్ళీ నాగార్జునకి బుగ్గపై ముద్దు పెట్టేసింది. అలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అషూ మొదట్లో ఇంట్లోకి వెళ్తూ, ఇప్పుడు బ‌య‌ట‌కు వెళ్ళిపోతూ చివర్లో కూడా నాగార్జున కు బుగ్గ పై ముద్దు పెట్టింది. అనంతరం బిగ్ బాస్ స్టేజీపైన అషు రెడ్డి కి హోస్ట్ నాగార్జున ఓ టాస్క్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల‌లో  ఒక్కొక్కరిని ఒక్కొక్క వెజిటేబుల్, ఫ్రూట్స్ తో పోల్చమని చెప్పి టాస్క్ ఇచ్చాడు. అప్పుడు అషు అన్ని చేదు అనుభవాలే అన్న ఉద్దేశంతో యాంక‌ర్ శివకు కాకరకాయ, ఆ తర్వాత పైకి ఏ విధంగా ఉన్నా లోపలికి మాత్రం మంచోడు, చిన్న పిల్లాడు అని చెప్పి నటరాజ్ కు కొబ్బరికాయ ఇచ్చింది. 

ఇక‌, బిగ్ బాస్ ఇంటి నుంచి సొంత ఇంటికి చేరుకున్న (Ashu Reddy) అషు.. హోస్ట్ నాగార్జున, షో గురించి చెప్తూ... నాగార్జునకు తాను ముద్దు పెడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అషురెడ్డి... ''ఈ ఇంటిలో లిటిల్ గాళ్ (చిన్నారి పిల్ల)ను నేను మిస్ అవుతానని నాగార్జున గారు చెప్పారు. బిగ్ బాస్ ప్రపంచంలో ఆయన ఎప్పుడూ మంచిగా ఉంటారు. మోటివేషన్ ఇస్తారు. ఆయన దగ్గర ఎనర్జీ ఉంటుంది. అందరినీ గౌరవిస్తూ మంచి హోస్ట్ గా ఉన్నందుకు థాంక్స్. నా హృదయంలో మీది ఎప్పుడూ ప్రత్యేక స్థానం'' అని అషురెడ్డి పేర్కొన్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!