బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి (Ashu Reddy) పుట్టిన రోజు వేడుకలో సందడి చేసిన బిగ్ బాస్ (Biggboss) మాజీ కంటెస్టెంట్స్

Published on Sep 17, 2022 09:16 PM IST

సోషల్ మీడియా యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు అషు రెడ్డి (Ashu Reddy). జూనియర్ సమంతగా టిక్ టాక్.. డబ్ ష్మాష్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యింది ఈ బ్యూటీ. కొన్ని షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ సాంగ్స్ తో సైతం మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే, బిగ్ బాస్ (Telugu Biggboss) హౌస్ కు ఎప్పుడైతే వెళ్లిందో అప్పటి నుంచీ ఆమె లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.

అషు రెడ్డి తన గ్లామర్, నటనతో అందరినీ ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో సైతం తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో నిద్రపోతోంది. ఆ మధ్య దర్శకుడు ఆర్జీవీతో (Director Ramgopal Varma) సంచలన ఇంటర్వ్యూ చేసి ఫుల్ ఫేమస్ అయింది ఈ అమ్మడు. ఆ బోల్డ్ ఇంటర్వ్యూ అప్పట్లో తెగ వైరల్ అయింది.

ఇదిలా ఉంటే.. తాజాగా బోల్డ్ బేబీ అషురెడ్డి (Ashu Reddy) తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి సినీ నటి హేమ, హరితేజ, బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్, అరియానా (Ariyana), జబర్దస్త్ పవిత్ర, వరుణ్ సందేశ్ దంపతులు, యాంకర్ రవి దంపతులు, హిమజ, విష్ణు ప్రియ, అఖిల్ సార్థక్ తదితరులు కూడా హాజరయ్యారు. 

మరోవైపు అషురెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమె తండ్రి బెంజ్ (Ashu Reddy Birthday Gift) కారును గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రస్తుతం ఆమె బర్త్ డేకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు అషు రెడ్డి (Ashu Reddy Birthday Party) బర్త్ డే పార్టీకి ముఖ్య అతిథిగా హాజరైన రామ్ గోపాల్ వర్మ పార్టీలో రచ్చ రచ్చ చేశాడు. తనదైన శైలిలో అషుతో కేక్ కట్ చేయించి రొమాంటిక్ గా తినిపించిన ఆయన.. నానా హంగామా చేస్తూ అభిమానులను అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 

Read More: బిగ్ బాస్ (Boggboss Nonstp) స్టేజీ మీదే హోస్ట్ నాగార్జున‌కు ముద్దుపెట్టిన అషూరెడ్డి!