సైమా (SIIMA) అవార్డ్స్ నామినేషన్లలో పుష్ప (Pushpa), అఖండ (Akhanda), జాతిరత్నాలు (Jathiratnalu)!
సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ (SIIMA) అవార్డ్స్ పండుగ త్వరలో జరుగనుంది. ఈ సంవత్సరం కూడా అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణాదికి చెందిన నాలుగు భాషలకు (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ) చెందిన నటీనటులు అవార్డుల కార్యక్రమంలో మెరవనున్నారు.
సినీ రంగంతో పాటు ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్‌లలో టాలెంట్‌ను కనబరిచిన నటులు, టెక్నీషియన్స్‌కు అవార్డులను బహూకరిస్తారు. 2021 సంవత్సరంలో విడుదలైన నాలుగు భాష సినిమాల నుంచి కూడా నామినేషన్స్ ప్రకటించారు.
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప', నందమూరి బాలకృష్ణ (BalaKrishna) హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'అఖండ' సినిమా.. ఎక్కువగా నామినేషన్స్ దక్కించుకున్నాయి. 'పుష్ప' చిత్రాన్ని (Pushpa) దాదాపు 12 విభాగాలలో, 'అఖండ' సినిమాని 10 విభాగాలలో నామినేషన్స్‌కు ఎంపిక చేసినట్టు సమాచారం.
పుష్ప సినిమా నుంచి దాదాపుగా..
ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీతం మొదలైన విభాగాలలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే 'అఖండ' చిత్రం ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీతం, ఫైట్స్, ఫొటోగ్రఫీ విభాగాలలో పోటీ పడుతోంది.
ఇక ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా 'జాతి రత్నాలు' కూడా నామినేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఉత్తమ కమెడియన్ విభాగంతో పాటు పలు విభాగాల్లో 8 నామినేషన్స్ దక్కించుకుందని టాక్.
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన 'ఉప్పెన' సినిమా కూడా సైమా అవార్డులలో వివిధ విభాగాలలో పోటీ పడుతోంది. ఉత్తమ నూతన నటుడు, నూతన నటి, ప్రతినాయకుడు.. ఈ విభాగాలతో పాటు ఇతర విభాగాలతో కలిపి మొత్తం 8 నామినేషన్లు సాధించిందని తెలుస్తోంది.
మరి ఏ సినిమా ఏ విభాగంలో ఎన్ని అవార్డులు సాధిస్తుందో చూడాలి మరి.
తెలుగు
పుష్ప ది రైజ్ (అల్లు అర్జున్) - 12
అఖండ (బాలకృష్ణ) - 10
జాతిరత్నాలు (నవీన్ పోలిశెట్టి) - 8
ఉప్పెన (వైష్ణవ్ తేజ్) - 8
మలయాళం
మిన్నల్ మురళి (టోవినో థామస్) - 10
కురుప్ (దుల్కర్ సల్మాన్) - 8
మాలిక్ (ఫహద్ ఫాజిల్) - 6
జోజీ (ఫహద్ ఫాజిల్) - 6
కన్నడ
రాబర్ట్ (దర్శన్) - 10
గరుడ గమన వృషభ వాహన (రాజ్ బి శెట్టి) - 8
యువరత్న (పునీత్ రాజ్ కుమార్) - 7
తమిళం
కర్ణన్ (ధనుష్) - 10
డాక్టర్ (శివ కార్తికేయన్) - 9
మాస్టర్ (విజయ్) - 7
తలైవి (కంగనా రనౌత్) - 7
Read More : పొలిటికల్ డ్రామాగా బాలకృష్ణ (Bala Krishna) – బోయపాటి కాంబినేషన్‌లో నాలుగో సినిమా?