ఆ క్యారెక్టర్ చేయనని చెప్పినా వదిలిపెట్టలేదు.. సీతారామం సినిమాలో పాత్రపై రష్మిక (Rashmika Mandanna) కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మికా మందాన (Rashmika Mandanna) కెరీర్‌లో పీక్ స్టేజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌లో `సీతారామం` ఒకటి. దుల్కర్ సల్మాన్‌తో టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన వింటేజ్ లవ్‌స్టోరీ సినిమా ఇది. 1964 కాలానికి ప్రస్తుత సమయాన్ని ముడిపెడుతూ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు.
మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన సీతారామం సినిమాలో రష్మికా మందాన, తరుణ్ భాస్కర్, సుమంత్, భూమిక కీలక పాత్రలు పోషించారు. కాశ్మీర్ కొండల్లోని ఒంటరి సైనికుడు లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్, అతడిని ప్రేమించే యువతి సీతామహాలక్ష్మి క్యారెక్టర్‌లో మృణాళ్ ఠాకూర్ నటించారు. కాశ్మీర్‌కు చెందిన ముస్లిం అమ్మాయి అఫ్రీన్‌గా రష్మిక కనిపించనున్నారు. కొద్ది నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న సీతారామం సినిమా ఆగస్టు 5న తెలుగు, మలయాళంతో పాటు పలు భాషల్లో రిలీజ్ కానుంది.
ప్రమోషన్స్‌తో మరో లెవెల్‌కు..
సీతారామం సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్‌లో రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ హను రాఘవపూడి `సీతారామం`లోని రష్మిక క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు భయపడిపోయి.. నో చెప్పానని అన్నారు. అయినా ఆమెను వదలకుండా అదే క్యారెక్టర్ చేయించారట డైరెక్టర్.
‘హను తనకు అఫ్రీన్ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ముందు భయం వేసింది, నేను చేయలేనని చెప్పాను. ఇప్పటివరకు నేను బబ్లీ క్యారెక్టర్స్, యాంగ్రీ బర్డ్ క్యారెక్టర్స్ చేశాను. అయితే ఇంత రెబల్‌గా, క్రూరమైన పాత్ర చేస్తే ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారా అని భయపడ్డాను. కానీ, పూర్తి కథ, తన క్యారెక్టర్ ఇంపార్టెన్స్ గురించి చెప్పడం, నేను చేయగలను అనే ధైర్యం దర్శకుడు హను ఇవ్వడంతో కొంత హార్డ్ వర్క్ చేసి ఫైనల్‌గా ఓకే చెప్పాను. ఈ సినిమా, అందులోని క్యారెక్టర్లు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి’ అంటూ చెప్పుకొచ్చారు రష్మిక (Rashmika Mandanna).