నటసింహం బాలకృష్ణ (BalaKrishna) ‘అన్‌స్టాపబుల్‌’ సీజన్ 2 షో ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందంటే?

Updated on Aug 23, 2022 08:17 PM IST
నటసింహం బాలకృష్ణ (BalaKrishna) ‘అన్‌స్టాపబుల్‌’ సీజన్ 1 పూర్తయినప్పటి నుంచి సీజన్‌2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు
నటసింహం బాలకృష్ణ (BalaKrishna) ‘అన్‌స్టాపబుల్‌’ సీజన్ 1 పూర్తయినప్పటి నుంచి సీజన్‌2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు

నందమూరి నటసింహం బాలకృష్ణ (BalaKrishna) సినిమాలతోపాటు షోలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ అయిన అన్‌స్టాపబుల్ సీజన్‌1లో సందడి చేశారు. పెద్ద సెలబ్రిటీ అయ్యిఉండి కూడా సెలబ్రిటీలతో, అభిమానులతో ఆయన చేసిన అల్లరికి అందరూ ఫిదా అయ్యారు.

 బాలకృష్ణ స్టైల్, యాటిట్యూడ్, మాట తీరు, మంచితనం, కోపం మిగతా హీరోలకు ఉండదు. మంచి పని చేస్తే చప్పట్లు కొట్టే ఆ చేతులే.. చెడ్డ పని చేస్తే చెంప పగులకొట్టే చనువు కూడా తీసుకుంటారు బాలయ్య.

అన్‌స్టాపబుల్ విత్ NBK అంటూ  టాక్ షోను ప్రారంభించి సీజన్‌ను విజయవంతంగా ముగించారు కూడా. ఈ షోకి వచ్చిన గెస్ట్ లతో బాలయ్య ఆట ఆడించిన తీరు.. ఆయన పలకరించిన విధానం.. ఆయన నవ్వించిన పద్ధతి.. జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  తనకు మిగతా హీరోలకు ఏదో గొడవ ఉందంటూ గాసిప్స్ వచ్చినా కూడా మా మధ్య ఏమీ లేదంటూ పటాపంచలు చేసిన తీరు జనాలను అలరించింది. ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు అందరి కళ్లు రెండో సీజన్‌పై పడ్డాయి.

నటసింహం బాలకృష్ణ (BalaKrishna) ‘అన్‌స్టాపబుల్‌’ సీజన్ 1 పూర్తయినప్పటి నుంచి సీజన్‌2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు

అన్ని ఏర్పాట్లు పూర్తి..

నిజం చెప్పాలంటే ఆయన నటించే సినిమాల కంటే ఎప్పుడెప్పుడు ఈ షో సీజన్ 2 స్టార్ట్ అవుతుందా అని నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వాళ్లందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షో కొత్త సీజన్ ని టెలికాస్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఆహా.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అన్‌స్టాపబుల్ రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌ను విజయదశమి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య లైఫ్ లో విజయదశమి స్పెషల్ అని అందరికీ తెలిసిందే. ఈ రోజునే ఎన్నో సినిమాలు రిలీజ్ అయి  బ్లాక్ బస్టర్ హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. మరి అలాంటి స్పెషల్ డే రోజున బాలయ్య అన్‌స్టాపబుల్ షో 2 ని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసింది ఆహా మేనేజ్‌మెంట్. సీజన్ 1 లో మహేష్ , అల్లు అర్జున్, మోహన్ బాబు, రాజమౌళి, కీరవాణి, రానా దగ్గుబాటి, రష్మికా మందాన, రవితేజ లాంటి ఎంతో మంది స్టార్స్ వచ్చి సందడి చేశారు.

బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ సీజన్2 లో అంతకుమించిన ఎనర్జిటిక్ హీరోస్ రాబోతున్నారని సమాచారం . ముఖ్యంగా బాలకృష్ణతో.. చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్ సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. దీంతో నెట్టింట బాలకృష్ణ (BalaKrishna) హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌ అవుతున్నాయి.

Read More : Nandamuri Balakrishna: బసవతారకం ఆస్పత్రిలో (Basavatarakam Cancer Hospital) జాతీయ జెండాను ఎగురవేసిన బాలకృష్ణ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!