Nandamuri Balakrishna: బసవతారకం ఆస్పత్రిలో (Basavatarakam Cancer Hospital) జాతీయ జెండాను ఎగురవేసిన బాలకృష్ణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ (Independace Day Celebrations) వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో (Basavatarakam Cancer Hospital) ఆసుపత్రి ఛైర్మన్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు, సినీ నటులు, నందమూరి బాలకృష్ణ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న అందరికి శుభాకాంక్షలు తెలిపారు బాలకృష్ణ (Nandamuri Balakrishna). స్వాతంత్య్రం కోసం పోరాడిన అందరిని స్మరించుకోవాల్సిన సమయం ఇది అని గుర్తు చేశారు. ప్రజలు పీల్చుకుంటున్న స్వేచ్ఛా వాయువులు ఎందరో త్యాగఫలితమన్నారు బాలకృష్ణ.
మహాత్మా గాంధీ, నేతాజీ, పింగలి వెంకయ్య, వావిలాల గోపాల కృష్ణ వంటి ఎందరో మహానుభావులు ఈ దేశానికి స్వాతంత్య్రం సిద్దించడానికి విశేష కృషి చేశారన్నారు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). 75 సంవత్సరములలో ఎంతో పురోగతి సాధించినా ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల దేశం తిరోగమనంలో పయనించే పరిస్థితి ఉందని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా… గోల్కొండ కోటపై (Golconda Fort) జెండాను ఆవిష్కరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే ప్రగతి భవన్ లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ నేరుగా.. గోల్కొండ పోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం అందుకున్నారు. అనంతరం.. గోల్కొండ కోటపై జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్.