అక్కినేని నాగచైతన్యతో (Naga Chaitanya) సినిమా చేయనున్న సంజయ్‌ లీలా భన్సాలీ.. చర్చలు జరుగుతున్నట్టు టాక్!

Updated on Aug 06, 2022 02:17 PM IST
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ

జోష్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు నాగచైతన్య (Naga Chaitanya). బంగార్రాజు, లవ్‌స్టోరీ సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్ హిట్లు అందుకున్నారు. ఇటీవలే ఆయన నటించిన ‘థాంక్యూ‘ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ప్రస్తుతం నాగచైతన్య నటించిన హిందీ సినిమా ‘లాల్‌ సింగ్ చడ్డా’ విడుదలకు రెడీగా ఉంది. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘లాల్‌ సింగ్ చడ్డా‘ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు నాగచైతన్య.

ఇక, భార‌తదేశం గ‌ర్వించ‌ద‌గిన ద‌ర్శకుల్లో ఒకరు సంజ‌య్ లీలా భ‌న్సాలీ. జరిగిన క‌థ‌ల‌ను అందంగా, అంద‌రికి అర్ధమయ్యేట్టుగా వెండితెర‌పై చూపించ‌డం సంజ‌య్ లీలా భ‌న్సాలీ స్పెషాలిటీ. సంజయ్‌ సినిమాల్లో టేకింగ్, విజువలైజేషన్, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బాలీవుడ్‌లో పీరియాడిక్ సినిమాలను సంజయ్ కంటే ఎవ‌రూ బాగా తెర‌కెక్కించ‌లేరేమో? అనేట్టుగా సినిమాలను తెరకెక్కిస్తుంటారు ఆయన.

ఇక ఇటీవ‌లే ‘గంగూబాయి క‌తియావాడి’ సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్నారు. నెట్‌ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న ‘హీర‌మండి’ వెబ్ సిరీస్‌ను కూడా తెర‌కెక్కిస్తున్నారు సంజయ్‌ లీలా భన్సాలీ. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇక ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం నాగ‌చైత‌న్యతో ఓ సినిమాని తెరకెక్కించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ

కొంత సమయం చూడాల్సిందే..

తాజాగా ఓ సందర్భంలో నాగచైతన్య, సంజ‌య్ లీలా భ‌న్సాలీని క‌లిశారట‌. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాను తెరకెక్కించడానికి చర్చలు కూడా జరిగాయని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. ఫ్యాన్స్ కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

ఇక ఆమిర్ ఖాన్ హీరోగా, నాగచైతన్య కీలకపాత్రలో నటించిన  సినిమా ‘లాల్ సింగ్ చ‌డ్డా’. ఆగ‌స్టు 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి స‌మ‌ర్పిస్తున్నారు. అలాగే ప్రస్తుతం నాగచైత‌న్య.. విక్రమ్ కుమార్‌  ద‌ర్శక‌త్వంలో ‘దూత‘ అనే హారర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ‘మానాడు’ ఫేం వెంక‌ట్ ప్రభు ద‌ర్శక‌త్వంలో ఓ యాక్షన్ సినిమా చేయడానికి ఓకే చెప్పారు నాగ చైతన్య (Naga Chaitanya).

Read More : Naga Chaitanya: నాపై వచ్చే రూమర్స్ ఫన్నీగా ఉన్నాయంటున్న నాగచైతన్య.. పట్టించుకోవడం మానేశానని వెల్లడి !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!