విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) ‘ఘర్షణ’కు సీక్వెల్‌పై డైరెక్టర్ గౌతమ్ మీనన్ క్లారిటీ.. కథ రెడీ చేస్తానని వెల్లడి

Updated on Sep 18, 2022 09:04 PM IST
గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) హీరోగా నటించిన ఘర్షణ సినిమా విడుదలై దాదాపు 18 సంవత్సరాలు గడిచింది.
గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) హీరోగా నటించిన ఘర్షణ సినిమా విడుదలై దాదాపు 18 సంవత్సరాలు గడిచింది.

విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) హీరోగా తెరకెక్కిన ఘర్షణ సినిమా వచ్చి దాదాపు 18 సంవత్సరాలు గడిచింది. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్‌ కాలేదు. అయితే ఘర్షణ సినిమా కథ, యాక్షన్ సీన్లు, ప్రేమ సన్నివేశాలు అన్నీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. ఆ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించడంపై కొన్ని రోజులు వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటి గురించిన అధికారిక సమాచారం రాకపోవడంతో చాలాకాలంగా ఘర్షణ సీక్వెల్‌ గురించి ఎవరూ స్పందించడం లేదు.

తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్న దర్శకులలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒకరు. 'ఘర్షణ', 'ఏ మాయ చేశావే', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్‌' వంటి సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. గౌతమ్‌ దర్శకత్వం వహించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల అవుతున్నాయి. లవ్ స్టోరీస్‌ను అందంగా తెరకెక్కించడం గౌతమ్‌ మీనన్ ప్రత్యేకత. తాజాగా గౌతమ్‌ దర్శకత్వం వహించిన 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమా శనివారం విడుదలైంది. శింబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది.

గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) హీరోగా నటించిన ఘర్షణ సినిమా విడుదలై దాదాపు 18 సంవత్సరాలు గడిచింది.

చిరంజీవితో కూడా..

వెంకటేష్ ‘ఘర్షణ’ సినిమాపై గౌతమ్ మీనన్ స్పందించారు. వెంకటేష్‌ను ఇటీవలే కలిసి, ఘర్షణ సీక్వెల్ గురించి చర్చించినట్లు తెలిపారు. సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ ఇంకా రాయలేదని, త్వరలోనే సీక్వెల్‌ను స్టార్ట్ చేస్తామని చెప్పారు గౌతమ్‌.

చిరంజీవితో ‘రాఘవన్’ స్టైల్‌లో ఒక థ్రిల్లర్ సినిమా చేయాలని ఉందని కూడా తెలిపారు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకుడిగానే కాకుండా, నటుడిగా కూడా పలు సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ‘సీతారామం’లో మేజర్ సెల్వన్‌గా నటించారు. తన తర్వాతి సినిమాను ఎనర్టిటిక్ స్టార్ రామ్‌తో చేయబోతున్నట్టు ప్రకటించారు గౌతమ్. విక్టరీ వెంకటేష్‌ (Venkatesh)తో ఘర్షణ సీక్వెల్‌ను ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి మరి.

Read More : Venkatesh : వెంకటేష్, రవితేజ కాంబినేషన్‌లో మల్టీస్టారర్! కథ రెడీ చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!